Hyderabad : కరోనా మహమ్మారి ప్రభావంతో ఆరోగ్యకరమైన ఆహారంపై అందరి చూపు పడింది. పోషకాలతో కూడిన ఆహార ఉత్పత్తులను తీసుకోవాలన్న అవగాహన పెరిగింది. ఇదే క్రమంలో రైతులు ఈ మధ్య కాలంలో సిరి ధాన్యాలపై దృష్టి సారించారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలను అందించే చిరుధాన్యపు పంటలను సేంద్రియ విధానంలో పండిస్తూ ప్రజలకు అందిస్తున్నారు. నగరాల్లో చాలావరకు ఆర్గానిక్ షాపుల్లో చిరుధాన్యాలను విక్రయిస్తున్నారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజల్లో ఇంకా చిరుధాన్యాలపై స్పష్టత రాలేదు. హోటల్స్ లో,దాబాల్లో వండే మసాలా ఆహారానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి. ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఒక రెస్టారెంట్ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో రెస్టారెంట్ 365 రోజులు ప్రజలకు బ్రేక్ ఫాస్ట్ ను ఫ్రీగా అందించేందుకు రెడీ అయింది.
హైదరాబాదులోని వనస్థలిపురంలో నవ్య మిల్లెట్స్ పేరుతో కొత్త రెస్టారెంట్ ప్రారంభమైంది. కొత్త రెస్టారెంట్ మాత్రమే కాదు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్రజల్లో మిల్లెట్స్ పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక కొత్త ప్రోగ్రాం ప్రారంభించింది. 365 రోజులు ప్రజలకు ఫ్రీగా బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం మొబైల్ వ్యాన్ సర్వీసెస్ ను వినియోగిస్తోంది. జనవరి ఒకటో తారీకు నుంచి ప్రారంభించిన ఈ ప్రోగ్రాం ను డిసెంబర్ 31 వరకు కొనసాగించనున్నారు. ఫ్రీ అన్నారు కదా అని ఏది పడితే అది పెట్టరు. పూర్తిగా మిల్లెట్స్ తో చేసిన అల్పాహారాన్ని మాత్రమే ఇస్తారు. ఆవు నెయ్యి పల్లీలతో చేసిన చట్నీ లను అందిస్తారు.అలా అల్పాహారాన్ని అందిస్తూనే ఆరోగ్యకరమైన చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇలా ప్రచారం కల్పించడం వల్ల రెస్టారెంట్ కి పేరు రావడంతో పాటు ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారం అందించినట్లు అవుతుంది. ఏది ఏమైనా ఇలా ప్రతిరోజు ఒక్కో ప్లేస్ కి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలకి ఫ్రీగా మిల్లెట్స్ తో కూడిన అల్పాహారం ఇవ్వడం అనేది మాత్రం మంచి కార్యక్రమం. ఈ విధంగానైనా ప్రజల్లో చైతన్య తీసుకొస్తున్నందుకు ఆ రెస్టారెంట్ వారిని అభినందించాల్సిందే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.