Vastu Tips: సాధారణంగా మనం జీవితంలో ఎదుగుతున్నాము అంటే తప్పనిసరిగా ఇతరుల చెడు ప్రభావం మనపై ఉంటుంది. ఎవరైనా జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటే చూసి ఓర్వలేని పరిస్థితులలో ఈ సమాజం ఉంది. ఇలా ఇతరుల చెడు ప్రభావం మన ఇంటి పై పడితే మనం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇతరుల నరదృష్టి పడకుండా ఉండడం కోసం మనం వాస్తూ పరంగా ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటాము. ఇక ఇలాంటి సమస్య నుంచి బయటపడాలి అంటే మంగళవారం ఈ చిన్న పని చేస్తే నర దిష్టి బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా చాలామంది మంగళవారం మన ఇంటి పై ఉన్నటువంటి దిష్టి తొలగిపోవడం కోసం గుమ్మం వద్ద నిమ్మకాయను కోసి దానికి పసుపు కుంకుమలు రాసి ప్రధాన ద్వారం గడప ఇరువైపులా పెడుతూ ఉంటాము అయితే ఇకపై మంగళవారం ఒక చిన్న గిన్నెలో నిండు బిందె నీటిని తీసుకొని అందులోకి ఒక చెంచా ఎర్రని కుంకుమ కలపాలి. అదేవిధంగా ఆ నీటిలోకి నిమ్మకాయలోని సగం చెక్కను పిండాలి.
ఈ విధంగా నీటిలోకి కుంకుమ నిమ్మకాయ కలిపిన నీటిని ప్రధాన గుమ్మం దగ్గరకు వెళ్లి బయట నుంచి కుడి వైపుకు తొమ్మిది సార్లు ఎడమవైపుకు 9సార్లు తిప్పి దిష్టి తీయాలి ఇలా దిష్టి తీసే సమయంలో ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి.ఇలా ఈ మంత్రం చదువుకుంటూ కుడి వైపుకు 9సార్లు ఎడమ వైపుకు 9సార్లు దిష్టి తీసిన తర్వాత ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. ఇలా చేయడం వల్ల మన ఇంటి పై ఉన్నటువంటి చెడు దృష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది.