Health Tips: డెలివరీ తర్వాత మహిళలు తమ ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన పెద్ద ఎత్తున ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక డెలివరీ తర్వాత తమ బిడ్డ ఆరోగ్యంతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బయట నిపుణులు సూచిస్తున్నారు. వారు తీసుకొని ఆహారం నుంచి మొదలుకొని వారి వ్యక్తిగత పరిశుభ్రత వరకు ప్రతి ఒక్క విషయంలోను జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ తర్వాత మహిళల శరీరంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తూ ఉంటాయి.
ఇలా శరీరంలో మార్పులు రావడమే కాకుండా డెలివరీ తర్వాత యోనిలో అనేక మార్పులు ఉంటాయి. దీని వల్ల అది మరింత సున్నితంగా మారుతుంది. నార్మల్ డెలివరీ తర్వాత చాలాసార్లు, యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదమూ ఉంటుంది. సిజేరియన్ చేసిన వారితో పోలిస్తే నార్మల్ డెలివరీ అయిన వారిలో ఈ ఇన్ఫెక్షన్లు అధికంగా ఉంటాయి. డెలివరీ తర్వాత రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది దాదాపు నాలుగు నుంచి ఆరు వారాలపాటు ఈ సమస్య ఉంటుంది.
ఇలాంటి సమస్య ఉన్నవారు తరచూ శుభ్రమైన లోదుస్తులు ధరిస్తూ నాప్కిన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి నాప్కిన్స్ మార్చడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉండవచ్చు. ఇక డెలివరీ తర్వాత పొరపాటున కూడా బిగుతుగా ఉండే దుస్తులను ధరించకూడదు మనం ఉపయోగించే దుస్తులు లో దుస్తులు చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.రెండు నెలల దాకా, చెప్పాలంటే కుట్లు పూర్తిగా నయం అయ్యేదాకా మహిళలు రోజుకు కనీసం రెండుసార్లు గోరువెచ్చని నీటితో యోని దగ్గర వేసిన కుట్లను శుభ్రం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఈ జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు.