Deepavali: దీపావళి పండుగ అంటేనే చీకటిలను పారద్రోలుతో వెలుగులు నింపే పండుగ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ దీపావళి పండుగ వస్తే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఇల్లు మొత్తం దీపాలతో అలంకరించుకోవడమే కాకుండా క్రాకర్స్ కాలుస్తూ సంతోష పడుతుంటారు. అయితే ఇలా దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు. కొంతమందికి మాత్రం ఈ టపాసులు వాసన వాటి నుంచి వచ్చే పొగ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఆస్తమా ఇతర శ్వాస కోస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వీలైనంతవరకు దీపావళి పండుగకు క్రాకర్స్ పేల్చకపోవడమే మంచిది ఒకవేళ తాము కూడా ఈ సంతోషంలో భాగం కావాలి అనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకొని ఈ పండుగను ఎంతో సంతోషకరంగా ఆరోగ్యంగా జరుపుకోవచ్చు. దీపావళి పండుగ సందర్భంగా ఆస్తమా సమస్యతో ఇబ్బంది పడేవారు ముందుగా మాస్క్ వేసుకొని టపాకులు కాల్చడం ఎంతో ముఖ్యం.
టపాసులు కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అలాంటి వారు ముందుగా ఇన్హేలర్ చేసుకోవడం లేదా ఇన్హేలర్ దగ్గర పెట్టుకోవడం చేయాలి తప్పనిసరిగా మాస్క్ వేసుకునే టపాసులు కాల్చాలి ఇక మీకు పొగ ఎక్కువ పడదు అనిపిస్తే వీలైనంతవరకు పొగ రాని టపాకాయలను కాల్చడం మంచిది. మరి ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటే అసలు టపాసులు కాల్చక పోవడమే మంచిదని చెప్పాలి. పలు జాగ్రత్తలు తీసుకొని టపాసులను కాల్చడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.