Vastu Tips: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను నమ్ముతూ ఉంటారు. అయితే మన ఇంట్లో కనుక సిరిసంపదలు కురుస్తున్నాయన్న మనం జీవితంలో ఒక మెట్టు పైకి ఎదిగిన చాలామంది మన కుటుంబం పై దిష్టి పెడుతూ ఉంటారు. ఇలా నరదిష్టి మన కుటుంబం పై ఉండటం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో కలహాలు మొదలవుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇలా నరదిష్టి కారణంగా సంతోషంగా ఉన్న కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి అందుకే మన ఇంటిపై ఎవరి దిష్టి ఉండకుండా ఉండడం కోసం కొన్ని వాస్తు పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఇలా వాస్తు పరిహారాలను పాటించడం వల్ల ఇంటి పై ఉన్నటువంటి చెడు ప్రభావం మొత్తం తొలగిపోతుందని పండితులు చెబుతుంటారు. మరి నరదిష్టి తొలగిపోవడానికి ఏం చేయాలి అనే విషయానికి వస్తే మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం గడప మీద ఆ నిమ్మకాయను కోసి గుమ్మం అటువైపు ఇటువైపు దానిని పెట్టి పసుపు కుంకుమ రాస్తే మన ఇంటి పై ఉన్నటువంటి నర దిష్టి అలాగే చెడు ప్రభావ దోషాలు మొత్తం తొలగిపోతాయి.
ఇక మంగళవారం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని అందులోకి కుంకుమ వేసి బాగా కలపాలి. ఈ కుంకుమ నీళ్లలోకి ఒక నిమ్మకాయను కట్ చేసి దాని రసం మొత్తం పిండాలి. ఇలా పిండిన ఈ కుంకుమ నీళ్లను తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం వద్ద కుడి వైపుకు 9సార్లు ఎడమవైపుకు 9సార్లు తిప్పి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయటం వల్ల ఇంటిపై ఉన్నటువంటి చెడు ప్రభావాలు మొత్తం తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.