Wed. Jan 21st, 2026

    Health Tips: సాధారణంగా చాలామంది తరచూ ఎదుర్కొనేటువంటి సమస్యలను నోటిపూత సమస్య ఒకటి. ఈ నోటి పూత సమస్య కారణంగా ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అయితే ఇలాంటి నోటి పూత రావడానికి కారణం ఆమ్ల గుణాలు ఎక్కువగా కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం అలాగే నీటిని అధికంగా తీసుకోకపోవడం వంటి కారణాలవల్ల నోటిపూత సమస్య ఏర్పడుతుంది.
    ఈ విధమైనటువంటి నోటిపూత సమస్య ఉన్నవారు ఈ చిన్న చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

    how-to-get-rid-of-mouth-ulcers-with-cardamom
    how-to-get-rid-of-mouth-ulcers-with-cardamom

    యాలకులలో ఎన్నో పోషక విలువలు ఔషధ గుణాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. యాలకులు కేవలం వంటకి రుచిని మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనకు అందిస్తాయి.ఒక గ్లాసు పాలల్లో దంచిన మూడు లేదా నాలుగు యాలకులు వేసి కొన్ని  నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పాలను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ తేనె కలిపి ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం వల్ల నోటి పూత సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

    రెగ్యులర్ డైట్ లో యాలకుల పాలను చేర్చుకుంటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఎముకలు కండరాలు బలోపేతం అవుతాయి. యాలకుల పాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
    జలుబు, దగ్గు వంటి సమస్యలను తరిమి కొడతాయి. చాలా మంది తలనొప్పి వచ్చిన సమయంలో పెయిన్ కిల్లర్ ను వేసుకుంటారు. కానీ అలాంటి సమయంలో ఒక గ్లాస్‌ యాలకుల పాలు తాగితే తల నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఇలా యాలకుల ద్వారా మనం ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు.