Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు దేవుడిని ఆరాధిస్తూ ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాము అయితే ఏదైనా ప్రత్యేక రోజు లేదంటే వారి ఇంటి కులదైవం రోజున నైవేద్యం సమర్పించి పూజలు చేస్తూ ఉంటారు. మన సంప్రదాయాల ప్రకారం దేవుడికి నైవేద్యం పెట్టడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అయితే నైవేద్యం పెట్టే సమయంలో చాలామంది తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం, లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, స్టీల్, లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు. అలా ఉంటే అది మహా పాపమే అవుతుంది. చాలా ముందుగా తయారు చేసినవి బాగా చల్లారి పోతాయి కనుక వాటిని నైవేద్యంగా పెట్టరాదని శాస్త్రం చెబుతోంది.
నైవేద్యాలను అప్పటికప్పుడు తయారు చేసుకుని దేవుడికి సమర్పించడం మంచిది.నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ మధ్యలో నీళ్ళు చల్లుతూ ఉండాలి. నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి.బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదట. అలాగే నిలవ ఉన్నవీ, పులిసిపోయినవనీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. తమ సొంత ఇంట్లోనూ, తమ సొంత ఆఫీసులోనూ నైవేద్యాన్ని యజమానులు మాత్రమే మాత్రమే స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి. ఇక దేవుడికి ఎవరైతే నైవేద్యం పెడతారో వారే హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు దేవుడు గది నుంచి బయటికి వచ్చేయాలి అప్పుడే ఆ దేవుడి చూపు నైవేద్యంపై పడుతుందని చెబుతారు. అనంతరం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇతరులకు పంచడం మంచిది.