Health Tips: మనం ప్రతి రోజు స్నానం చేసే సమయంలో కాలానికి అనుకూలంగా స్నానాలు చేస్తూ ఉంటారు. చాలామంది చలికాలం అయితే తప్పనిసరిగా వేడి నీటితో స్నానం చేస్తారు అలాగే వేసవి కాలంలో వేడి నీటితో స్నానం చేయడానికి ఎవరు ఇష్టపడరు అలాంటి సమయంలో చల్లనీటితోనే స్నానం చేస్తూ ఉంటారు. ఇలా కాలానికి అనుగుణంగా వేడి నీళ్లు చల్లనీల్లతో స్నానం చేయడం మంచిదా లేకపోతే కాలం ఏదైనా వేడి నీళ్లు లేదంటే చల్లనీలతో స్నానం చేయడం మంచిదా అనే విషయంపై నిపుణులు పలు ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నారు.
వేడి నీరు ఉపశమన లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది విశ్రాంతిగా ఉండాలని భావించినప్పుడు స్నానాలకు ఒక ప్రసిద్ధ ఎంపికగా మారింది. ఇది కండరాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, ఉద్రిక్తత లేదా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు వేడి నీటిలో స్నానం చేసినప్పుడు వేడి మీ శరీరంపై ఉన్న స్వేద రంధ్రాలను తెరుస్తుంది.
ఇలా స్వేద రంధ్రాలు తెరవడం వల్ల మన శరీరం నీటిగా శుభ్రం అవుతుంది తామర, ముఖంపై మొటిమలు వంటి సమస్యలతో బాధపడే వారికి వేడి నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి. మరోవైపు, చల్లటి నీటి స్నానాలు చాలా ఉత్తేజకరమైనవి. వీటితో స్నానం చేయాలనుకుంటే రిఫ్రెష్గా ఉంటుంది. చల్లని నీరు వాపును తగ్గించడానికి, తిమ్మిరి నొప్పిని తగ్గించడానికి, ఇంకా రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. అథ్లెట్లు లేదా తీవ్రమైన శారీరక శ్రమ నుండి కోలుకుంటున్న వ్యక్తులకు చల్లటి నీటి స్నానాలు చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.