Honey Water: చాలామంది వారి ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే కాఫీ టీ తాగడం మానేసి ఈ మధ్యకాలంలో హనీ వాటర్ తాగుతున్నారు. ఇలా హాని వాటర్ తాగటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే తేనెను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకొని సేవిస్తుంటారు. దీనివల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు అతి బరువు సమస్య, డయాబెటిస్, చెడు కొలెస్ట్రాల్, ఫ్లూ లక్షణాల నుంచి తొందరగా బయటపడవచ్చు.
ప్రతిరోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని సేవిస్తే ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నీ పూర్తిస్థాయిలో స్థాయిలో నియంత్రించుకోవచ్చు. తద్వారా శరీర బరువు తగ్గి ఉబకాయ సమస్యకు స్వస్తి పలకవచ్చు.అయితే చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే తేనె నిమ్మరసం నీటిలో వేసి బాగా మరిగించి లెమన్ టీ అంటూ తాగుతుంటారు. దీనివల్ల మీకు ఎలాంటి అంటే ఆరోగ్య ప్రయోజనాలు లభించవు.
తేనెను నీటిలో మరిగించడం వల్ల అందులో ఉండే ఔషధ గుణాలు నశించిపోతాయి. కావున తేనె పానీయాన్ని సేవించాలనుకుంటే గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించడం మంచిది. మలబద్ధకం గ్యాస్ట్రిక్ అజీర్తి ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని సేవిస్తే కడుపులో ఉండే చెడు మలినాలు తొలగిపోయి పేగు కదలికలు మెరుగుపడతాయి.ఇక వేసవికాలంలో శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది. అయితే ఈ హనీ వాటర్ ఆరోగ్యానికి మంచిది కదా అని ఆహారం కూడా మానేసి రోజంతా ఇదే తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. రోజుకు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.