Honey: సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపయోగించే వాటిలో తేనె కూడా ఒకటి వివిధ అవసరాల కోసం తేనెను ఉపయోగిస్తూ ఉంటాము. తేనే ఆరోగ్యానికి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే జుట్టు విషయానికి వచ్చేసరికి తేనెను చాలామంది దూరం పెడుతూ ఉంటారు. పొరపాటున తేనె కనక జుట్టుకు అయితే జుట్టు మొత్తం తెల్లబడుతుందని అందుకే తేనే జుట్టుకు రాసుకోకూడదు అంటూ పెద్దలు జాగ్రత్తలు చెబుతుంటారు. అయితే ఇది అనుభవ పూర్వకంగా ఎవరు చెప్పినది లేదు కానీ పెద్దలు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.
ఈ విధంగా తేనె కనుక జుట్టుకు తగిలితే జుట్టు మొత్తం తెల్లబడుతుందని చెబుతుంటారు. నిజంగానే జుట్టు తెల్లబడుతుందా నిపుణులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే… తేనెజుట్టుకు తగలడం వల్ల జుట్టు ఎట్టి పరిస్థితులలోను తెల్ల పడదని నిజం చెప్పాలంటే చాలా ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. తేనె జుట్టుకు ఒక న్యాచురల్ కండిషనర్ గా ఉపయోగపడుతుందని తెలిపారు. తేనెలో ఎక్కువగా నియాసిస్, రిబోఫ్లావిన్, జింక్, ఐరన్ వంటి పోషకాలతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది.
Honey:
ఇది జుట్టుని కాంతివంతం చేస్తుందట. తేనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా పెరగడమే కాకుండా చాలా దృఢంగా కూడా తయారవుతుంది. తేనె జుట్టును తెల్లగా మారుస్తుందని చెప్పే మాటలు కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అయితే తేనెలో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్ ఏజెంట్. దాని కారణంగా అతిగా తేనెను జుట్టుకు రాయడం వల్ల కాస్త రంగు తగ్గుతుందని చెబుతున్నారు.రంగు తగ్గడం అంటే నల్లగా ఉన్న జుట్టు కాస్త బ్రౌన్ రంగులోకి మారుతుంది కానీ తెలుపు రంగులోకి మారదని నిపుణులు చెబుతున్నారు.