Health Tips: చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో అరికాళ్ళ మంట సమస్య ఒకటి. స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇక రాత్రి సమయంలో ఈ మంట కారణంగా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. తరచూ ఇలా అరికాళ్ళు మంట పెడుతున్నాయి అంటే మీరు విటమిన్స్ సమస్యతో బాధపడుతున్నారని అర్థం.
ఎప్పుడైతే మన శరీరానికి తగినంత విటమిన్ బి 12 తక్కువగా ఉంటుందో ఆ సమయంలోనే ఇలా అరికాళ్ళలో మంటలు పుడతాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా మనం తీసుకొనే ఆహార పదార్థాలలో b12 ఉండాలి. ఇక బి12 విటమిన్ ఎక్కువగా మనకు పాలు పాలు పదార్థాలలో పుష్కలంగా లభిస్తుంది. కనుక మనం తీసుకునే ఆహారంలో భాగంగా వీటిని తప్పనిసరిగా జోడించాలి.
పాలు పాల పదార్థాలతో పాటు మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా కూరగాయలు ఆకుకూరలు చేర్చుకోవాలి అలాగే చికెన్ మటన్ వంటి వాటిని తీసుకొనే సమయంలో చాలామంది లివర్ తినడానికి ఇష్టపడరు. అయితే లివర్ లో చాలా పుష్కలంగా మనకు బి-12 విటమిన్ ఎప్పుడైతే విటమిన్ బి12 తగ్గిపోతుందో ఆ సమయంలోనే అరికాలు మొత్తం మంటలుగా ఏర్పడతాయి అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే విటమిన్ బి12 అధికంగా ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం ఎంతో ఉత్తమం.