Amnesia: ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న వస్తువులు ఎక్కడపడితే అక్కడ పెట్టేసి మరిచిపోతూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు అలా ఎంత వెతికినా కూడా కొన్ని వస్తువులు అసలు కనపడవు. ఇలా ఈ మతిమరుపు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. మామూలుగా మతిమరుపు సమస్య అన్నది వయసు మీద పడిన వారిలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం చిన్న వయసు వారు కూడా మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చదువుకునేవాళ్లకు పరీక్షల్లో సమాధానాలు గుర్తుకు రాక మార్కులు తక్కువ వస్తుంటాయి.
ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు. దీనికి ఏకైక పరిష్కారం మెదడుకు మేత పెట్టడమే. అది రోజువారీ చేయాల్సిన ఎక్సర్ సైజ్. ప్రతి పనిలోనూ దీన్ని ఆచరణలో పెట్టాలి. మీరు కూడా అలా మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు తెలుసుకోవాల్సిందే. ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకే బుర్రకు పని చెప్పకుండా టెక్నాలజీ పై ఆధారపడుతున్నారు. కనీసం పది మంది నంబర్లనైనా సొంతగా గుర్తు పెట్టుకోవట్లేదు. అంటే మైండ్ ని పట్టించుకోవట్లేదు. బ్లాంక్ గా ఉంచుతున్నారు. లెక్కలు చేయాలంటే క్యాలికులేటర్ వాడుతున్నారు. చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలకు కూడా అర్థాలను డిక్షనరీలో చూస్తున్నారు. చదవటం, రాయటం, గుర్తు పెట్టుకోవటం వంటివాటిని ఎప్పుడో మర్చిపోయారు.
రోజు రోజుకీ వస్తువుల మీద ఆధారపడటం పెరుగుతోంది. అలా బ్రెయిన్ వాడకం పూర్తిగా తగ్గిపోయింది. యంత్రాల సాయాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల మనుషుల జీవితం కూడా యాంత్రికంగా మారిపోతోంది. మతి మరుపునకు 90 శాతం ఇదే కారణమని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెదడుకి పని చెప్పటమే కరెక్ట్ అని సూచిస్తున్నారు. డైలీ న్యూస్ పేపర్స్, మంచి మంచి బుక్స్ చదవటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ మొబైల్ లో యూట్యూబ్ వీడియోలే చూస్తుంటే మైండ్ యాక్టివ్ నెస్ తగ్గిపోతుంది. పిల్లలు స్కూల్లో, కాలేజీల్లో ఇచ్చిన హోం వర్క్ చేసినట్లుగా పెద్దలు కూడా సెల్ఫ్ హోం వర్క్ చేసుకోవాలి. బుర్ర ఉపయోగించే చెస్ వంటి ఆటలాడాలి. అలాగే సమయం దొరికినప్పుడల్లా ఏదైనా లైబ్రరీకి వెళ్లడం ఇలాంటివి చేయాలి.
ఒంటరిగా ఉండకూడదు. దిగాలుగా కూర్చోకూడదు. ఎప్పుడూ నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. వివిధ అంశాలపైన ఎదుటివాళ్లతో చర్చించాలి. కొత్త విషయాలను తెలుసుకోవటం పైన ఫోకస్ పెట్టాలి. టీవీ చూడటం తగ్గించాలి. యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఏకాగ్రతను పెంచుకోవాలి. . టీవీ చూడడం మంచిదే కానీ ఏవైనా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే టీవీని చూడడం మంచిది. విద్యార్థులు చదువుకున్న టాపిక్ లను ఒకటికి రెండు సార్లు మననం చేసుకోవాలి దీంతో అవి మెదడులో ఉండిపోతాయి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఠక్కున గుర్తుకొస్తాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి గాడ్జెట్లను అవసరమైనప్పుడే వాడాలి. అతి అనేది ఎక్కడా పనికిరాదని గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే మతి మరుపును శాశ్వతంగా మర్చిపోతారు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.