Home remedy: నిత్యం అసిడిటీతో బాధపడుతున్నారా..అయితే ఇకపై చింతించాల్సిన పనిలేదు. సహజ సిద్ధంగానే సహజంగా పండిన ఆహారంతో ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చంటున్నారు వైద్య నిపుణులు. యాసిడ్ రిఫ్లక్స్‌ను సాధారణంగా అసిడిటీ అని అంటుంటారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటంతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడాల్సి వస్తుంది. ఇప్పటికీ చాలా మంది అసిడిటీ బారినపడి ఇబ్బందులు పడి ఉండి ఉంటారు.
జంక్ ఫుడ్స్, అనారోగ్యకరమైన ఆహారం ఏం తిన్నా అసిడిటీ అటాక్ చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరూ దీనిని పట్టించుకోరూ. ఇలాంటి సమయంలో స్మార్ట్ డైట్‌లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసిడిటీని తగ్గించుకోవచ్చు. కడుపులో పీహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసి అసిడిటీ ఏర్పడటాన్ని తగ్గించే అనేక ఆహారాలు మన అందుబాటులోనే ఉన్నాయి. ఎసిడిటీ లక్షణాలను తగ్గించి, హెల్త్ బెనిఫిట్స్‌ను అందించే ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసిడిటీని ఎదుర్కోవడానికి చాలా సింపుల్ హోం రెమెడీస్ లో కోల్డ్ మిల్క్ ఒకటి. పాలలోని రిచ్ కాల్షియం హైడ్రోక్లోరిక్ ఆమ్లాలను కంట్రోల్ చేసి కడుపులోని అసిడ్స్‌ను అబ్సార్బ్ చేస్తుంది. చల్లని పాలు అసిడిటీకి సరైన విరుగుడు, ఎందుకంటే ఇది కడుపులో మంట నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
2 వాము :
అజీర్ణం కారణంగా సాధారణంగా వచ్చే ఎలాంటి పొత్తికడుపు అసౌకర్యానికి అయినా వాము బాగా పనిచేస్తుంది. ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యకు ఇది నాచురల్ రెమిడీ. వాములో ఉండే ఆక్టివ్ ఎంజైములు బయోకెమికల్ థైమెల్ ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్య నుంచి అయినా ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. చిటికెడు ఉప్పుతో వామును కలిపి తిన్నా లేదా రాత్రంతా టేబుల్ స్పూన్ వామును నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయం తాగవచ్చు.
3 ఆపిల్ సైడర్ వెనిగర్ :
యాసిడ్ రిఫ్లక్స్ తరుచుగా అజీర్ణం వల్ల వస్తుంది కాబట్టి భోజనానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల రిఫ్లక్స్ తగ్గుతుందని నిపుణుల మాట. ఇది పీహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసి కడుపులో ఆసిడ్ స్థాయిలను న్యూట్రలైజ్ చేసేందుకు సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో 1-2 టేబుల్ స్పూన్‌ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి రోజులో ఒక పూట తాగాలి.
4. తులసి ఆకులు :
అన్ని రకాల సమస్యలకు సరైన మూలికగా ఉపయోగపడుతుంది తులసి. అసిడిటీని తగ్గించడంలోనూ బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. కడుపులో బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా, యాసిడిటీ ఏర్పడటం తులసి తక్షణ ఉపశమనాన్ని అందించి శరీరాన్ని కుదుటపరుస్తుంది. రోజులో రెండు ఆకులను నమిలినా సరిపోతుందా లేదా రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి.
5. సోంపు :
ఇది అందరికి తెలిసిన చిటకానే. ఎసిడిటీ ఏర్పడినా గుండెల్లో మంటగా ఉన్నా సోంపు చక్కని ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది, ఉబ్బరం, కడుపు నొప్పి లక్షణాలను తగ్గిస్తుంది.
6 నాన్ సిట్రస్ ఫ్రూట్స్ :
అరటిపండ్లు, యాపిల్స్, వాటర్ మిలాన్, తర్బూజ వంటి నాన్-సిట్రస్ పండ్లు అసిడిటీని తగ్గించడంలో చురుకుగా పనిచేస్తాయి. ఈ పండ్లు యాసిడ్ రిఫ్లక్స్ కోసం ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. వీటిలో ఫైబర్ శాతం పుష్కలంగా ఉంటుంది, ఇవి కడుపులో అసౌకర్యాన్ని ఎదుర్కోవటానికి సహాయపడతాయి.
7 కొబ్బరి నీరు :
యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారు తియ్యని కొబ్బరి నీరు తాగడం వల్ల చక్కని ఉపశమనం లభిస్తంది. కొబ్బరి నీళ్లు తాగినప్పుడు శరీరంలో ఉన్న pH స్థాయిలు ఆమ్ల స్థాయి నుండి బేసిక్ స్థాయికి మారుతాయి. యాసిడ్ రిఫ్లక్స్‌ను నియంత్రించడంలో కీలకమైన పొటాషియం ఈ కొబ్బరి నీటిలో ఉండే ఎలక్ట్రొలైట్ల లక్షణాల కారణంగా యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గించవచ్చు.
8 అల్లం :
అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి అజీర్ణం ,గుండెల్లో మంట నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఇది అన్న వాహికలోకి ప్రవహించి కడుపులో ఉన్న ఆమ్లాన్ని తగ్గిస్తుంది. కడుపుకి ఉపశమనాన్ని కలిగిస్తుంది. టీగానూ లేదా వంటల్లో అల్లాన్ని వినియోగించి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
చూశారుగా ఇన్ని సహజ సిద్ధమైన మన వంటింట్లో లభించే వస్తువులతో అసిడిటీకి కల్లెం వేయవచ్చు. మీరూ ఈ టిప్స్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాము.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.