Holi: మన హిందువులు ఎన్నో పండుగలను ఎంతో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ ఉంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. హోలీ అనేది రెండు రోజుల పండుగ. హోలికా పూజ హొలీ పండగ, హోలికా దహన్‌తో ప్రారంభమవుతుంది. ఈ హోలీ పండుగ రోజున హోళికా దహనం జరుగుతుంది. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ రోజున హోలికా దహనం అగ్ని ద్వారా ప్రతికూల శక్తులు నాశనం అవుతాయని నమ్మకం.
ఈ విధంగా హోలికా దహనం రోజున ఆవు పిడకలను దండలుగా కట్టి ఈ ఆవు పిడకల ద్వారా ఈ హోలీకా దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అయితే ఈ వేడుకలలో భాగంగా కేవలం ఆవు పిడకలను ఉపయోగించడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈ పండుగకు ముందు రోజే ఆవు పేడతో చిన్న చిన్న పిడకలు చేసే వాటికి చిన్నచిన్న రంధ్రాలు పెట్టి కొద్ది రోజులు ఎండలో ఆరిన తర్వాత దండలుగా కుడతారు.
ఇలా దండలుగా తయారు చేసుకున్నటువంటి వీటిని హోళికా దహనం రోజు ఉపయోగిస్తారు ఇలా ఆవు పిడకలను ఉపయోగించటం వల్ల. వెలువడే పొగ ప్రతికూల శక్తులను దూరం చేయడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఈ కారణంగా ఆవు పేడతో చేసిన పిడకలను మత పరమై ఆచారాలలో కూడా వ్యవహరిస్తారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవులు సకల దేవతలు కొలువై ఉంటారని భావిస్తారు అందుకే ఈ హాలికా దహనంలో ఆవు పిడకలను ఉపయోగిస్తారు.
హోలీ పండుగ సమయానికి శీతాకాలం ముగిసి వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ సమయంలో అనేక రకాల బ్యాక్టీరియా పెరిగే వాతావరణం ఉంది. ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరం. ఈ బ్యాక్టీరియా వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వాతావరణాన్ని శుద్ధి చేయడం కోసం ఈ పిడకలను కాల్చడం వల్ల వీటి నుంచి వెలువడే పొగ ద్వారా వాతావరణం కూడా శుద్ధి పడుతుందని సైంటిఫిక్ గా కూడా ఈ విషయాన్ని నమ్ముతారు కనుక ఆవు పిడకలను ఉపయోగిస్తారు.