Spiritual: భారతదేశంలో ఎన్నో దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. శైవ ఆలయాలు, వైష్ణవ ఆలయాలు వేలాది సంఖ్యలో భారతదేశంలో సనాతన వైదిక నాగరికత లో భాగమై ఉన్నాయి. ఎంతోమంది మహారాజు ఈ ఆలయాలను అప్పటి వారి ఇ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించారు. అయితే ఈ ఆలయాల వెనుక ఎంతో ప్రశస్తమైన వైదిక చరిత్ర దాగి ఉంది. సాక్షాత్తు భగవంతుడి భక్తులకు కోరికలు ఇచ్చేందుకు ఈ భూమండలం పైకి వచ్చి స్వయంభువుగా వెలసిన దివ్య క్షేత్రాలు ఒక ప్రసిద్ధి పొందాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలని అనుసంధానిస్తూ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, మహిమాన్వితమైన శక్తి పీఠాలు, వైష్ణవ ఆలయాలు వేలాది ఏళ్లుగా పూజలందుకుంటున్నాయి. హిందూ మతాన్ని విశ్వసించే భక్తులు వేల సంఖ్యలో ఈ ఆలయాలను, అక్కడ వెలసిన దేవాది దేవుని దర్శించుకోవడానికి వ్యయప్రయాసలకోర్చి వెళ్తూ ఉంటారు. అయితే భారత దేశం పై ముస్లింల దండయాత్ర కాలంలో ఎన్నో ఆలయాలను ధ్వంసం చేశారు. దీంతో చాలా ఆలయాలు శిథిలావస్థకు చేరి ఎలాంటి పూజలు నోచుకోకుండా ఉన్నాయి. మరికొన్ని ఆలయాలు పునర్నిర్మించి వైదిక ఆచారాలను నిర్వహిస్తున్నారు. హలో ముస్లింల దండయాత్ర ధ్వంసమైన ఆలయం మధ్యప్రదేశ్లో భైద్యనాధ్ ఒకటి.
బ్రిటిష్ వాళ్ళు ఇండియా ని ఆక్రమించుకున్న తర్వాత కూడా ఎన్నో ఆలయాలను కూల్చివేశారు. అయితే ఈ ఒక్క ఆలయాన్ని బ్రిటిష్ వాళ్ళ నిర్మించడం విశేషం. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఒకే ఒక ఆలయంగా భైద్యనాథ్ ఆలయం చరిత్రలో నిలిచిపోయింది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. మార్టిన్ అనే బ్రిటిష్ కల్నల్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం సమయంలో ముస్లిం రాజులతో పోరాటానికి వెళ్లారు. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యం ముస్లిం సైన్యం చేతిలో ఓడిపోయే స్థితిలో ఉంది. బ్రిటిష్ కల్నల్ భార్య ఈ ఆలయంలో మహా దేవుని దర్శించుకుని, అక్కడి పూజారులు చెప్పిన ప్రకారం శివపంచాక్షరీ మంత్రాన్ని 11 రోజులపాటు పట్టించింది. దాంతో సాక్షాత్తు ఆ మహా దేవుడి బ్రిటిష్ సైన్యం తరఫున ముస్లిం సైన్యంతో పోరాడి వారిని తరిమి కొట్టి మార్టిన్ సైన్యాన్ని కాపాడాడు. ఈవిషయం ఇండియాకు వచ్చిన తర్వాత మార్టిన్ తన భార్యతో పంచుకున్నాడు. ఒక త్రిశూలదారి వచ్చి తమని రక్షించినట్లు చెబుతాడు. దీంతో సాక్షాత్తు పరమశివుడే తన భర్తను కాపాడమని మార్టిన్ భార్యకు అర్థమవుతుంది. అదే విషయాన్ని భర్తకు తెలియజేసి ఆలయానికి వెళ్లి ఆ ఆలయ పునర్నిర్మాణం కోసం 15000 విరాళంగా ఇచ్చారు. ఈ విషయం అక్కడి శిలాఫలకాలలో వ్రాయబడి ఉంది. వీటి ఆధారంగా బ్రిటిష్ వారు నిర్మించిన శివాలయంగా భైద్యనాధ్ ఆలయం చరిత్రకెక్కింది
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
This website uses cookies.