Hi Nanna Movie Review: విడుదల తేదీ : డిసెంబర్ 07, 2023
నాతెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా, శృతి హాసన్, జయరామ్.. తదితరులు
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహద్
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
దర్శకుడు : శౌర్యవ్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
Hi Nanna Movie Review: నేచురల్ స్టార్ నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. డిఫరెంట్ కథా చిత్రాలలో వచ్చి ఆకట్టుకుంటుంటాడు. గత చిత్రం దసరా 100 కోట్ల మార్క్ ని దాటింది. దాంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు హాయ్ నాన్న అంటూ వచ్చిన నాని ఏ మేరకు హిట్ సాధించాడు..అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
విరాజ్ (నాని) పాపులర్ ఫొటోగ్రాఫర్. ముంబైలో సొంతగా ఒక ఫోటో స్టూడియోను నడుపుతుంటాడు. విరాజ్ కి మహి (బేబీ కియారా ఖన్నా) అనే కూతురు ఉంటుంది. పుట్టినప్పటి నుంచే మహి ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటుంది. డాక్టర్స్ మహి బ్రతికేది కొద్దిరోజులే అని చెప్పినప్పటికీ.. తన కూతురు తనను వదిలి వెళ్ళదు..అనే నమక్కంతో ఉంటాడు విరాజ్. ఇదిలా ఉంటే మహికి తన తల్లి గురించి తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. అసలు విరాజ్ భార్య ఎవరు ?, విరాజ్ తన భార్యతో ఎందుకు విడిపోయాడు..? విరాజ్ జీవితంలోకి యశ్న (మృణాల్ ఠాకూర్) ఎందుకు వచ్చింది ?, వంటి ఆసక్తికరమైన విషయాలతో సాగిందే హాయ్ నాన్న కథ.
ప్లస్ పాయింట్స్:
‘హాయ్ నాన్న’ ఒక హృదయాలను హత్తుకునే కథనంతో తండ్రీకూతుళ్ల మధ్యన సాగే ఎమోషన్స్ డ్రామా. నాని, మృణాల్ ఠాకూర్ మధ్య జరిగే సంఘర్షణను.. మృణాల్ పాత్ర తో కథలో బలాన్ని చొప్పించడం అందరికీ కనెక్ట్ అయ్యే అంశం. ఈ రెండు పాత్రలే కథలో ఎంతో కీలకం. కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు శౌర్యవ్ రాసుకున్న కథ ఇందులోని పాత్రలు కొంత మేరకు ఆకట్టుకుంటాయి.
ఎప్పటి లాగే నాని తన సహజమైన నటనతో విరాజ్ పాత్రని లాక్కొచ్చాడు. ద్వితీయాత్ర్థంలో నాని పాత్ర కీలకంగా నిలిచింది. ఎమోషనల్ సీన్స్ చేయడం నానికి బాగా అలవాటు అయింది. కాబట్టి ఎమోషన్స్ బాగా పలికించాడు. క్లైమాక్స్ సీన్స్ కి ప్రాణం పోశాడు.
‘సీతారామం’ సినిమాతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ కి హాయ్ నాన్నలో నటించడానికి అవకాశం ఉన్న పాత్ర దొరికింది. ఉన్నంతలో బాగా నటించి ఆకట్టుకుంది. శృతి హాసన్, జయరామ్, బేబీ కియారా, ప్రియదర్శి చక్కగా పర్ఫార్మ్ చేశారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు శౌర్యవ్ తీసుకున్న కథ బాగున్నప్పటికీ.. కథనం రాసుకోవడంలో కొంత వరకూ ఫెయిల్ అయ్యాడు. హీరోహీరోయిన్ల మధ్య రాసుకున్న లవ్ సీన్స్ కూడా రెగ్యులర్ గాఅనిపిస్తాయి. ఓవరాల్ గా దర్శకుడుగా చూస్తే మొదటి సినిమా అయినా బాగానే మెప్పిస్తాడు.
ఇంకాస్త స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కొన్ని సీన్స్ మరీ సాగతీతగా అనిపిస్తాయి. వాటినికి ఇంకా తగ్గిస్తే బావుండేది. హాయ్ నాన్న సినిమాకి మైనస్ అయింది క్లైమాక్స్. కొత్తగా అనిపించకపోవడం వల్ల ఆడియన్స్ థ్రిల్ ఫీలవడానికి ఏమీ ఉండదు.
సాంకేతిక విభాగం:
శౌర్యవ్ దర్శకుడిగా చక్కటి కథాంశాన్ని రాసుకున్నాడు. ప్లజెంట్ మేకింగ్. స్క్రీన్ ప్లే లో పట్టు లేకపోవడం కాస్త దెబ్బ తీసింది. సినిమాకి ప్లస్ పాయింట్ అంటే సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహద్. ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయ్యాయి. ఎడిటర్ కొన్ని సీన్స్ ని ఇంకా ట్రీమ్ చేస్తే బావుండేది. ఇక వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బావున్నాయి.
ఫైనల్‌గా:
‘హాయ్ నాన్న’ ఫీల్ గుడ్ మూవీ విత్ ఎమోషనల్ డ్రామా. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. నానికి మరో హిట్ దక్కినట్టే.