Hi Nanna First Review: ‘హయ్ నాన్న’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రేక్షకులు గనక ఈ సినిమాను కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది. నేచురల్ స్టార్ నాని, ‘సీతారామం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ‘హాయ్ నాన్న’ ఈ డిసెంబర్ 7న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ బాగానే ప్రమోషన్స్ చేస్తూ సినిమా ప్రేక్షకులకి చేరువ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక ‘హాయ్ నాన్న’ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందట. ఇందులో నాని తన కూతురు భవిష్యత్తు నుండి గతంలోకి వస్తే ఎలా ఉంటుంది..అన్న పాయింట్ తో ఆసక్తికరంగా రూపొందించారట. ఇప్పటికే, ఓసారి హైదరాబాద్ లో ప్రివ్యూ షో చూసిన సినిమా జర్నలిస్టులు కొందరు ప్రేక్షకుల నుంచి ‘హాయ్ నాన్న’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా నాని, మృణల్ మధ్య లవ్ సీన్స్, అలాగే, నాని-పాప కియారాల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు. ఇక ‘ఖుషి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహబ్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అని అంటున్నారు. ఒకప్పుడు హిందీలో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమా ఫ్లేవర్ కనిపిస్తుందని అంటున్నారు. నాని గత చిత్రం ‘దసరా’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రాబోతున్న ‘హాయ్ నాన్న’ కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని ఎంతో ధీమాగా ఉన్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.