Mahesh Babu : త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. ఎట్టిపరిస్థితిలో గుంటూరు కారం సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఆ ప్రణాళికకు తగ్గట్టుగానే ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా సినిమా పూర్తి చేస్తున్నారు.డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ సాధించాలని కసిగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి త్రివిక్రమ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రిన్స్ మహేష్ కూడా చాన్నాళ్లు షూటింగ్ కు దూరంగా ఉంటూ వచ్చారు.
ఎట్టకేలకు ఈ మధ్యనే అన్ని అవరోధాలు దాటుకుని మళ్లీ షూటింగ్ మొదలైంది. దీంతో సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చే విధంగా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు మేకర్స్. మహేష్ సినిమా అంటే మామూలుగా ఉండదు. మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ధమ్ మసాలా సాంగ్ ఇరగదీస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన మాస్ సాంగ్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.
ఇక ఈ మూవీ నుంచి రెండో పాట ఏంటా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లాస్ట్ వీక్ లోనే ఈ సాంగ్ ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు . కానీ మళ్ళీ ఏమైందో ఏమో ఆ నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేశారు. అయితే ఫస్ట్ వీక్ అంతా అనిమల్ హడావిడి ఉండడంతో రిలీజ్ ఎందుకులే అని అనుకున్నారు కాబోలు అందుకే వాయిదా వేశారు అంటున్నారు విశ్లేషకులు.. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి విడుదల పక్కా అని డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు . ఈ లెక్కన నెక్స్ట్ వీక్ సెకండ్ సింగిల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రెండో పాట మెలోడీగా ఉండబోతుందట. ఈ సాంగ్ మహేష్ శ్రీలీల మధ్యలో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.
తమన్ త్రివిక్రమ్ అల..వైకుంఠపురములో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. మళ్లీ ఈ కాంబినేషన్ గుంటూరు కారంలో కలిసి పనిచేస్తోంది. దీనితో మ్యూజిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి పాట ఫ్యాన్స్ ఊహించని రేంజ్ లో వైరల్ కాలేదు కానీ రెండో పాట అయినా ఇక ట్రెండ్ సెట్ చేస్తుందని నాగవంశీ కాన్ఫిడెంట్గా తెలిపారు.
Guava fruit: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా పండ్లలో…
SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
This website uses cookies.