Hesham Abdul Wahab : ఒక సినిమాకు కెప్టెన్ అఫ్ ది షిప్ డైరెక్టర్. హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఫుల్ బాధ్యత డైరెక్టర్ దే. సినిమా కథకు కావాల్సిన స్టార్స్ ని, టెక్నీషియన్స్ ను ఎంచుకోవడం వంటి కీలక బాధ్యతలు అన్నీ కూడా డైరెక్టర్ వే . అందులో ఏ ఒక్కటి తేడా కొట్టినా సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయం. అందులోనూ సినిమాను ప్రాణమైన సంగీత దర్శకుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు సినిమాకు హిట్ కొట్టాలి.అటు ప్రొడ్యూసర్ల జేబులు నిండాలి .డైరెక్టర్ అనేటోడు అలా ప్లాన్ చేసుకుంటేనే ఇండియాట్రీలో ఎక్కువకాలం నిలబడగలడు. ఈ విషయంలో హాయ్ నాన్న మూవీ డైరెక్టర్ శౌర్యువ్ విజయం సాధించాడనే చెప్పాలి.
నేచురల్ స్టార్ నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది . డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాడు.ఈ ఏడాది విడుదలైన దసరా 100 కోట్ల మార్క్ ని దాటి బ్లాక్ బిస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ఆ మూవీ తర్వాత లేటెస్ట్ గా హాయ్ నాన్న అంటూ పలకరిస్తున్నాడు. హాయ్ నాన్న మూవీ ఇవాళ విడుదలైంది. పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే… మ్యూజిక్ డైరెక్టర్‌గా హేషమ్ అబ్డుల్ వహాబ్ స్వరపరిచిన సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ గానీ, నాని – మృణాల్ రొమాంటికల్ సీన్స్ గానీ, హేషమ్ అందించిన మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్ లో ఉందని అనుకోవాలి . లవ్ స్టోరీస్ కి హేషమ్ అందించే సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో రిలీజ్ అయిన ‘హృదయం’ మూవీ టైంలోనే హేషమ్ తనను తాను నిరూపించుకున్నాడు.
ఈ మధ్యనే విడుదలైన విజయ్ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’ సినిమా మ్యూజిక్ వల్లే హిట్ అయ్యిందని ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు హాయ్ నాన్నకి కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ? నాన్న మూవీ రివ్యూ ప్రకారం.. సినిమా నేరేషన్ చాలా స్లోగా ఉండలేన, ఇంటర్వె7ల్ అనంతరం మూవీ చాలా బోరింగ్ గా ఉందని క్రిటిక్స్ అంటున్నారు . కానీ, ఎంతో కొంత పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయంటే… అందుకు కారణం హేషమ్ అబ్డుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ వల్ల అనే చెప్పొచ్చు.
సినిమాకు మ్యూజిక్ ప్రాణం. మూవీని భుజాలపై మొస్తుంది అని అంటారు కదా… ఇప్పుడు హాయ్ నాన్న సినిమాను హేషమ్ అందించిన మ్యూజికే మోస్తుంది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హేషమ్ డిమాండ్ మరింత పెరిగే అవ7కాశం ఉంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న కొద్ది మంది మ్యూజిక్ డైరెక్టర్లు… భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ అవుట్ పుట్ మాత్రం అంచనాలను అందుకోవడం లేదు. ఇలాంటి టైంలో హేషమ్ క్లిక్ కావడంతో… దర్శక నిర్మాతలకు ఆయన మొదటి ఆప్షన్ కావొచ్చు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.