Hema : బెంగళూరు శివారులో జరిగిన రేవ్ పార్టీ కేసులో నటి హేమకు పోలీసులు నోటీసులు పంపించారు. ఈ కేసు విచారణలో భాగంగా కర్ణాటక పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. పోలీసులకు అడ్డంగా బుక్కైంది. డ్రగ్స్ టెస్ట్‌లో హేమ బ్లడ్ లో డ్రగ్ సాంపుల్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు. హేమతో పాటు మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మిగతా వారికి కూడా పోలీసులు నోటీసులు పంపించారు. అయితే ఘటనపై తాజాగా హేమ రియాక్ట్ అయ్యింది. ఏం చేస్తారో చేసుకోండి అని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సమయం వచ్చినప్పుడు నేనూ మాట్లాడతా అని మీడియాతో తెలిపింది.
ఇదిలా ఉంటే ఈ రేవ్ పార్టీకి వచ్చిన హేమ ముందు తను అసలు రాలేదని బుకాయించింది. అయితే ఇక్కడకు వచ్చిన హేమ తన పేరును మార్చి రాసిందని తెలుస్తోంది. హేమ తన పేరును కృష్ణవేణిగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ కావడంతో ఆమెను హేమగా గుర్తించినట్లు చెప్పారు.
బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ హాజరైనట్లు కమిషనర్ దయానంద్ మంగళవారం ప్రకటించారు. అయితే తన తప్పును కవర్ చేసుకునేందుకు ఓ వీడియోను విడుదల చేసింది. రేవ్ పార్టీతో నాకేమీ సంబంధం లేదు. కావాలని నా పేరు తీసుకువస్తున్నారని ఆమె ప్రచారానికి దిగింది. ఈ క్రమంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆధారాలతో పోలీసులు విషయాన్ని తెలిపారు. టాలీవుడ్ కి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ రేవ్ పార్టీలో గుర్తించామని చెప్పారు. వారి దగ్గరి నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. 101 మందిలో ఐదుగురు మినహా మిగిలిన వారందరినీ జామీనుపై రిలీజ్ చేశారు పోలీసులు. రేవ్‌పార్టీలో ఎండీఎంఏ ట్యాబ్లెట్స్, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు అమ్మారో లేదో పోలీసులు విచారిస్తున్నారు.