Heart Attack: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పూర్తిగా వారి ఆహార వ్యవహారాలను అలవాట్లు మార్చుకున్నారు ఇలా ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వల్ల ఎన్నో రకాల సమస్యలు కూడా వారిని వెంటాడుతూ ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు కూడా గుండెపోటుకు గురవుతున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇంత చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఆహారంలో మార్పులే అని చెప్పాలి.
ఒకప్పుడు ఎన్నో పోషక విలువలు కలిగిన పదార్థాలను ఆహారంగా తీసుకునేవారు కానీ ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ పాకెట్ ఫుడ్ తినటం వల్ల గుండెపోటుకు గురయ్యే, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ప్రాసెస్ చేయబడిన మాంసం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వీటిలో బకన్ , హమ్ లో శాజురేటేడ్ ఫ్యాట్ , సోడియం ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
శుద్ధి చేసిన రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పాస్తా , పిజ్జాలు తిన్నా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. చక్కర కూడా శరీరానికి ఎంతో హాని చేస్తుంది. కూల్ డ్రింక్స్ , కృత్రిమ పానీయాలు గుండెపోటుకు కారణం అవుతాయని వీలైనంతవరకు వీటిని తగ్గించి ఇంట్లోనే మనం స్వయంగా తయారు చేసుకుని ఆహార పదార్థాలను తినటం వల్ల మరికొన్ని కాలాలపాటు మన గుండె పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.