Heart Attack: ప్రస్తుత కాలంలో గుండెపోటు సమస్యలతో బాధపడే వారి సంఖ్య అధికమవుతుంది. అతి చిన్న వయసులోనే గుండెపోటుకు గురి కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పాలి. తీవ్రమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, రోజువారి ఆహారంలో అత్యధిక కేలరీలు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు కలిగిన ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వంటివి ఎక్కువగా తినడం వల్ల ఉబకాయ సమస్య తలెత్తి అనేక గుండె జబ్బులకు కారణం అవుతుంది. ఇలా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉందని చెప్పాలి. అయితే మనకు ముందుగానే గుండెపోటు రాబోతుందని కొన్ని సంకేతాలు మనలో కనపడుతుంటాయి ఇలాంటి లక్షణాలు కనుక కనబడితే వెంటనే అప్రమత్తం కావడం ఎంతో మంచిది మరి ఆ లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే….
గుండెపోటు రావడానికి ముందు అలసటగా ఉండి శరీరం మొత్తం చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, గుండె భాగంలో పట్టేసినట్టు ఉండి గుండె దడగా ఉండడం వంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి. ఒక్కొక్కసారి మాట తీరు స్పష్టంగా లేకపోవడం, తీవ్రమైన దగ్గు, గొంతు పట్టేసినట్టు అనిపించడం లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని గుండె వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది.
Heart Attack:
గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు కూడా గుండె పోటుకు పరోక్ష కారణాలు అన్నది గుర్తుంచుకోవాలి.అయితే ఒకటి రెండు సార్లు ఇలా అనిపిస్తే దానిని ఏమాత్రం ఆ శ్రద్ధ చేయకూడదని ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మన గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఈ విధమైనటువంటి లక్షణాలు మనలో కనుక కనపడితే మనం త్వరలోనే గుండెపోటుకు గురి కాబోతున్నామని సంకేతం అందుకే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సరైన చికిత్స తీసుకోవడంతో గుండెపోటు మరణాలను సంఖ్యను తగ్గించవచ్చు.