Health: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎముకల నుంచి మెదడు వరకు పూర్తిస్థాయిలో పోషకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని అర్థం. మరి ముఖ్యంగా కంటి ఆరోగ్యమనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. కరోనా కారణంగా ఈమధ్య చాలా వరకు చిన్న పిల్లలు ఫోన్లకు బానిసలయ్యారు. ఆన్లైన్ క్లాసులని ట్రైనింగ్ లని అన్ని ఫోన్ లోనే జరిగిపోయాయి.
చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలు మారం చేస్తున్నారని ఫోన్లను చేతికి ఇచ్చేస్తున్నారు వాళ్ల చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఫోన్ నుంచి వచ్చే హాని కారక లైట్ వల్ల పిల్లల కంటి చూపు పై ప్రభావం చూపుతోంది. ఫోన్లనే కాదు ఈ మధ్యన బలమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది చిన్న వయసులోనే పిల్లల్లో చూపు మందగిస్తోంది. కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నపిల్లల కంటి చూపును కాపాడేందుకు కొన్ని రకాల పోషకాహారాలు తల్లిదండ్రులు అందించాల్సిన అవసరం ఉంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సన్ గ్లాసెస్‌కు ప్రత్యామ్నాయం లేదు. ఒక్కసారి వస్తే జీవితకాలం వాటిని కంటిన్యూ చేయాల్సిందే లేదంటే ఆపరేషన్ కు వెళ్లాల్సిందే అయితే చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయరు కాబట్టి చిన్న వయసులో కళ్ళజోడు వచ్చిన వారికి కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి వాటిని తప్పనిసరిగా పేరెంట్స్ అందించాల్సిందే. విటమిన్ ఎ, బీటా-కెరోటిన్‌లకు సంబంధించిన లుటిన్, జియాక్సంతిన్ కూడా సూర్యరశ్మి దెబ్బతినకుండా కంటి కణజాలాలను రక్షించడంలో సహాయపడతాయి. ఈ పోషకాలను ముదురు ఆకుపచ్చ ఆకు కూరలల్లో లభిస్తాయి. కేలే, కొల్లార్డ్ గ్రీన్స్, టర్నిప్ గ్రీన్స్ బచ్చలికూర, బ్రోకలీ, కివి, పసుపు స్క్వాష్, నారింజ బొప్పాయి లో ఇవి లభిస్తాయి.
శరీరానికి లుటీన్ , జియాక్సంతిన్‌ను గ్రహించడానికి కొవ్వు అవసరం . ఆలివ్ నూనె , అవకాడో , గుడ్డు వంటి ఆహారాన్ని పిల్లలకు అందించాలి. మన శరీరాలు బీటా-కెరోటిన్‌ను విటమిన్ ఏ గా మారుస్తాయి. విటమిన్ ఏ అనేది కంటి చూపుకు చాలా ముఖ్యమైనది. చీకటిలో కూడా చూసే సామర్థ్యాన్ని విటమిన్ ఏ మన శరీరానికి అందిస్తుంది. చిలగడదుంపలు, క్యారెట్‌లు , బటర్‌నట్ స్క్వాష్, బచ్చలికూర, కొల్లార్డ్ గ్రీన్స్‌తో సహా ముదురు ఆకుపచ్చ ఆహారాలను పిల్లలకు ఆహారంలో భాగం చేయాలి. ప్రతిరోజు పాలు, గుడ్లను పిల్లలకు తినిపించాలి. .
జ్యుసి స్ట్రాబెర్రీలు పిల్లలకు ఇష్టమైనవి మాత్రమే కాదు, వీటిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. స్ట్రాబెర్రీలు కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. కాబట్టి పిల్లలకు వీటిని ఎక్కువ మొత్తంలో అందిస్తే వారి కంటి ఆరోగ్యం బాగుంటుంది. నారింజ ముక్కలు , బ్రోకలీ, బెల్ పెప్పర్‌లతో కూడిన వెజ్జీ కబాబ్‌లు వారి ఆహారంలో భాగం చేయాలి.
జియాక్సంతిన్, బీటా-కెరోటిన్ , విటమిన్ ఎ, కొన్ని ఆరోగ్యకరమైన కొవ్వులలో ఒమేగా-3లు కూడా ఉంటాయి. సాల్మన్ , ఫ్యాటీ చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఉపయోగ పడతాయి. పాదరసం తక్కువగా ఉండే చేపలను పిల్లలకు అందిస్తూ ఉండాలి. ఈ ఆహారాలను తరచుగా పిల్లలకి ఇవ్వడం వల్ల వారి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది . మరి మీరు ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకు అడుగు వేస్తారని ఆశిస్తున్నాం.