Health Tips: సాధారణంగా వివాహం తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే గర్భం దాల్చిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తల్లులు జాగ్రత్తగా ఉంటేనే కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీన నేషనల్ సేఫ్ ప్రెగ్నెన్సీ డేగా ప్రకటించారు. ఈ సందర్భంగా గర్బ ధారణ సమయంలో స్త్రీలు ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి వెల్లడించారు. గర్భ ధారణ సమయంలో మహిళలు చేయవలసిన, చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భధారణ సమయంలో స్త్రీలు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే రాత్రి సమయంలో మంచి నిద్ర పట్టాలంటే కెఫిన్ తీసుకోకూడదు. కెఫిన్ నిద్ర దెబ్బ తీస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో మహిళలు చాలా చురుకుగా ఉండాలి. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామాలు చేయటం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామం చేయడం వలన ఒత్తిడి తగ్గటమే కాకుండా మధుమేహం, ప్రీ ఎంక్లాంప్సియా ప్రమాదం కూడా తగ్గుతుంది.
అంతే కాకుండా గర్భిణీ స్త్రీలు నీరు ఎక్కువగా తీసుకోవాలి.ఇలా నీరు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆ నీళ్లు ఆరోగ్యకరమైన రక్తపోటుని నిర్వహిస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను, ముందస్తు ప్రసవ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇక వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు కచ్చితంగా ఉండాలి.
Health Tips:
ఇక గర్భిణీ స్త్రీలు మద్యపానం ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి శిశువు జననం, తక్కువ బరువు, ప్రసవం, ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ లాంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. గర్భ ధారణ సమయంలో ధూమపానం, మద్యపానం చేస్తే రక్తస్రావం, ప్రసవ సమయం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చెడు అలవాట్లు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. ఇటువంటి అలవాట్లకు గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండాలి.