Health Tips: ప్రస్తుత కాలంలో మనం తినే ఆహార పదార్థాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోతుంది. అయితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించటానికి వ్యాయామాలు చేయడంతో పాటు సరైన ఆహారం తినడం వల్ల కూడా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మన ఆహారం తీసుకునే సమయంలో కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించవచ్చు. ఇప్పుడు మనం ఆ ఆహార పదార్థాలు గురించి తెలుసుకుందాం.
సాధారణంగా పప్పుతో తయారు చేసిన వంటలను ఎక్కువగా తింటుంటాము. పప్పులో ఉండే పీచు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే బ్రౌన్ రైస్ తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రణలో ఉంటూ గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 20 శాతం తగ్గిస్తుంది. అలాగే మనం వంటలలో ఉపయోగించే పసుపు వల్ల ఆహారం రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Health Tips:
పసుపులో ఎన్నో ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ను తగ్గుతుంది. జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం పరిశోధనలో పసుపు , మిరియాల పొడి కలిపి 12 వారాలపాటు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి త్వరగా తగ్గుతుంది. అలాగే బ్రిటిష్ జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదిక ప్రకారం ప్రతీ రోజు పెరుగు తినడం వల్ల నాలుగు శాతం దాకా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎందుకంటె పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ క్రియను పెంచి వాపు సమస్యలను దూరం చేస్తాయి. అలాగే గ్రీన్ టీ, నిమ్మరసం కలిపి తీసుకోవటం వల్ల కూడా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.