Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందువల్ల వేసవికాలంలో కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఒక పండు తీసుకోవడం వల్ల కలరా, హిట్ స్ట్రోక్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఇలా మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఆ పండు మారేడు పండు. ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫైబర్, ఐరన్, ప్రోటీన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా కాల్షియం, విటమిన్ ఏ, సి , డి వంటివి కూడా అధికంగా ఉన్నాయి.
ఈ పండు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే వేసవికాలంలో ఈ పండు తినటం వల్ల శరీరానికి చలువ లభిస్తుంది. అలాగే ఇది గుండె , మెదడుకు టానిక్‌గా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం విరోచనాలు వంటి సమస్యల పరిష్కారానికి కూడా ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే పొట్టలో అల్సర్‌తో బాధపడుతున్నప్పుడు బిల్వపండు తినడం మేలు చేస్తుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల పొట్టలోని లైనింగ్‌పై పొర ఏర్పడుతుందని, ఇది అల్సర్‌లు వేగంగా నయం అవుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
Health Tips:
అలాగే ఈ పండులో ఉండే బిల్వలో టానిన్ కలరా వ్యాధి నిర్మూలనకు ఉపయోగపడుతుంది. కలరా సమస్యతో బాధపడేవారు ఈ పండుని తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ పండుని నేరుగా తినలేని వారు జ్యూస్ చేసుకుని కూడా తాగవచ్చు. అలాగే ఈ పండుతో తయారుచేసిన జ్యూస్ తాగటం వల్ల లిపిడ్ ప్రొఫైల్ , ట్రైగ్లిజరైడ్‌లను నియంత్రనకు సహాయపడుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో అధిక బరువు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్లు కూడా ఈ పండు తినటం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది .