Wed. Jan 21st, 2026

    Health Tips: ఈ రోజుల్లో చాలామంది తీవ్రమైన ఒళ్ళు నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు ఒళ్ళు నొప్పుల సమస్య తలెత్తిన వెంటనే నొప్పి నివారణ మందులను ఆశ్రయించకుండా ఒళ్ళు నొప్పుల సమస్య తలెత్తడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే సులువుగా నొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చు. అయితే చాలామంది ఇలా నొప్పి నివారణ పొందడం కోసం ఎక్కువగా మందులను ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఎలా నొప్పుల మాత్రలను ఉపయోగించడం ఎంతో ప్రమాదకరం అయితే తరచూ ఒళ్ళు నొప్పులు తలెత్తడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే పోషకాహార లోపం, అధిక ఒత్తిడి నిద్రలేమి సమస్య వల్ల శారీరక, మానసిక అనారోగ్యానికి కారణం అవుతాయి. అధిక ఒత్తిడి కారణంగా మన శరీరంలో జీవక్రియ రేటు తగ్గి శరీర అవయవాలు అలసిపోతాయి. దాంతో మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తి తీవ్ర ఒళ్ళు నొప్పులకు కారణమవుతాయి. ఈ కారణాల వల్ల మనకు వల్ల నొప్పులు కనుక వస్తే వెంటనే ఉపశమనం కోసం నొప్పులు మాత్రలను ఉపయోగించకూడదు కాసేపు విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

    ఇక చాలా మంది యూరిన్ వెళ్లడానికి బద్ధకం ఇస్తూ నీళ్లను తక్కువగా తాగుతూ ఉంటారు ఎప్పుడైతే మనం నీళ్లు తక్కువగా తాగుతాము అప్పుడు ఒళ్ళు నొప్పులు అధికమవుతాయి. ఒకసారిగా మన శరీరం డిహైడ్రేషన్ కి గురి అవుతుంది. ఎప్పుడైతే డీహైడ్రేషన్ అవుతాము ఆ సమయంలో మన శరీరంలో అవయవాల పనితీరు పూర్తిగా తగ్గిపోతుంది. ఇక విటమిన్ డి లోకం కారణంగా కూడా చాలా మందిలో నొప్పులు ఉంటాయి ఇలాంటి విటమిన్ కారణంగా శరీర నువ్వులతో బాధపడేవారు విటమిన్ అధికంగా తీసుకోవాలి వీటిని టాబ్లెట్స్ రూపంలోనూ అలాగే ఆహార రూపంలోనూ తీసుకోవాలి అలాగే ఉదయం సూర్య కిరణాలు మనపై పడేలా ఉండాలి. ఇలా కాకుండా తరచూ నొప్పి మాత్రలు వేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలు, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.