Health Tips: రోజువారి దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల వ్యాపకాలలో బిజీగా ఉండటం వలన రాత్రి అయితే చాలా మంది ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. అయితే కొంతమంది రాత్రి సమయాలలో కూడా డ్యూటీ చేస్తూ ఉంటారు. వీరికి శారీరక జీవ క్రియల సమతౌల్యం దెబ్బతినే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే శరీరాన్ని ఏదో ఒక కండిషన్ కి అలవాటు చేసుకోవాలి. కాని చాలా మంది కొన్ని రోజులు రాత్రి, కొన్ని రోజులు పగలు నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి వారికి తరువాత కాలంలో నిద్రలేమి సమస్య ఎక్కువగా వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా నిద్ర సమస్యపై స్లీప్ ఫౌండేషన్ ఒక అద్యయనం చేసింది. రోజులో పది సార్లు కంటే ఎక్కువ ఆవలించే వారు ఉంటారు. కొంత మంది అయితే అలా రోజంతా ఆవలిస్తూనే ఉంటారు. ఈ ఆవలింతలు తీవ్రమైన అనారోగ్య సమస్యలని సూచిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆవలింతలు ఎవరికైనా ఎక్కువగా వస్తున్నాయి అంటే వారు వెంటనే అప్రమత్తం అవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అప్నియా అనే నిద్రకి సంబందించిన డిసీజ్ ఉంటే అధికంగా పగటి పూట నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి వారు నిద్రపోకుంటే ఆవలింతలు విపరీతంగా వస్తూ ఉంటాయి.
ఇవి జీవక్రియ వ్యాధుల బారిన పడటానికి కారణం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నార్కో లిప్సీ అనే వ్యాధి నిద్రలేమి సమస్యని సూచిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో కూడా విపరీతమైన ఆవలింతలు వస్తూ ఉంటాయి. సమయంతో సంబంధం లేకుండా హఠాత్తుగా వారు నిద్రపోతూ ఉంటారు. ఈ వ్యాధి ఉన్నవారిలో శ్వాస సమస్య తీవ్రంగా ఉంటుంది. వారిలో గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. పగటిపూట అతి నిద్ర అనేది చాలా ప్రమాదకరం అని చెబుతునానరు. అతిగా ఆవలింతల సమస్య ఉన్న, పగటిపూట అతిగా నిద్రపోతున్న వెంటనే డాక్టర్లుని సంప్రదించి పరీక్షలు చేసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.