Health Tips: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా నీటిని తీసుకోవడం ఎంతో అవసరం. ఇలా మన శరీరానికి అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది. అలాగే చర్మం కూడా ఎంతో కాంతివంతంగా ఉండటమే కాకుండా శరీరంలోని జీవక్రియలు కూడా చాలా సక్రమంగా జరుగుతాయి. అందుకే ప్రతిరోజు దాదాపు 5 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు.
ఇలా నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని భోజనం చేసే సమయంలో కూడా చాలామంది అధికంగా నీటిని తాగుతూ ఉంటారు. ఇలా భోజనం చేసే సమయంలో నీటిని త్రాగటం వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు తెలియచేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకునే సమయంలో ఎట్టి పరిస్థితులలో కూడా నీటిని తీసుకోకూడదు. మనం భోజనం చేసే సమయంలో కారంగా ఉందని చెప్పి చాలామంది నీటిని తాగుతుంటారు.ఇలా త్రాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం ఏమాత్రం జీర్ణం కాక అజీర్తి సమస్యలు ఏర్పడతాయి.
ఇక పెరుగుతో అన్నం తినేటప్పుడు కూడా చాలామంది నీటిని తాగుతూ ఉంటారు ఇలా తాగటం మంచిది కాదు. చాలామంది అరటిపండు తినేటప్పుడు నీటిని తాగుతారు అరటిపండు తినేటప్పుడు నీటిని తాగటం వల్ల మన శరీరంలో అధికంగా గ్యాస్ట్రిక్ జ్యూస్ విడుదల అవుతుంది. అలాగే జీర్ణ క్రియ కూడా పూర్తిగా తగ్గిపోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అందుకే అరటిపండు తినేటప్పుడు నీటిని త్రాగకూడదు ఇక మసాలా కారం వంటి పదార్థాలను తినే సమయంలో కూడా నీటిని తీసుకోవడం వల్ల పొత్తికడుపులో నొప్పి రావడం, అజీర్తి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా భోజనం చేసే సమయంలో నీటిని తీసుకోకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.