Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో శరీరం డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటుంది. అందువల్ల ఆ సమస్య తలెత్తకుండా ఉండాలంటే వేసవిలో నీరు ఎక్కువగా తాగాలి. వేసవిలో మాత్రమే కాకుండా సాధారణంగా నీరు ఎక్కువగా తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. నీటిలో ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా శరీరంలో ఉన్న మలినాలు మూత్రం రూపంలో తొలగించి అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి కూడా నీరు ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడటానికి నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని తాగటం మంచిది. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
• నిమ్మకాయ: వేసవిలో నిమ్మకాయ రసం నీటిలో కలుపుకొని తాగటం చాలా మేలు చేస్తుంది. ఇలా చేయటం వల్ల శరీరానికి చలువ చేయడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
• కీర దోసకాయ – పుదీనా: వేసవిలో కీరదోసకాయ, పుదీనాను నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా రోజూ కీర దోస ముక్కలు,పుదీనా ఆకులు వేసిన నీటిని తీసుకోవడం ద్వారా మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.
Health Tips:
• చియా సీడ్స్: వేసవిలో చియా గింజలను నీటిలో కలిపి తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య దరిచేరదు. అంతే కాకుండా శీరరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని కూడా తొలగిస్తుంది.
• బెల్లం : వేసవి కాలంలో బెల్లం కలిపిన నీటిని తాగడం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల శరీరానికి చలువ ఇవ్వటమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.