Health Tips: ఆకుకూరలు కూరగాయలు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో ఉండే అనేక రకాల పోషకాలు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో వేసవి తాపం నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఎంతో ఉపయోగపడతాయి. వీటివల్ల వేసవికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
ముఖ్యంగా వేసవి కాలంలో సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వేసవి ఉష్ణోగ్రతల నుండి శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా సొరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటె సొరకాయలో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవికాలంలో దీనిని ఆహారంగా తీసుకుంటే శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది.
అంతేకాకుండా వేసవికాలంలో సొరకాయ శరీరాన్ని చల్లగా ,రిఫ్రెష్‌గా ఉంచుతుంది. సొరకాయలో ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల విటమిన్లు, నీరు ,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. సొరకాయ తినటం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. అలాగే జీర్ణ క్రియ న మెరుగుపరిచి జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి.
Health Tips:
అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వారికి కూడా సొరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. తరచూ సొరకాయ తినటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించి శరీర బరువును నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.