Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా శరీరం డిహైడ్రేషన్ కి గురవటం, వడదెబ్బ, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో పాటు నోరు పొడిబారుతూ ఉంటుంది. అయితే వేసవికాలంలో ఇటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరం డిహైడ్రేషన్ తో పాటు నోరు పొడి వారి సమస్య తరచూ వేధిస్తు ఉంటుంది. అయితే ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి కొన్ని చిట్కాలు పాటించాలి. నోరు పొడిబారే సమస్యకి ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అంతే కాకుండా కాఫీ, టీ వంటి వి ఎక్కువగా తాగటం వల్ల కూడా నోరు పొడిబారే సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఆహారం, తినటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల వేసవి కాలంలో కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి. అంతే కాకుండా వేసవి కాలంలో దుమపానం, మద్యపానం ఎక్కువగా చేయటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అందువల్ల వేసవిలో ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
Health Tips:
అలాగే శరీరం డీహైడ్రేట్ అవకుండా తరచూ నీరు తాగుతూ ఉండాలి. అలాగే వేసవి ఉష్ణోగ్రతల నుండి శరీరానికి చలువ అందించే మజ్జిగ, నిమ్మ రసం, రాగి జావ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల నోరు పొడిబారే సమస్య తలెత్తకుండా ఉంటుంది. అలాగే తరచూ నోటిని శుభ్రంగా చేసుకోకపోయినా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అందువల్ల ప్రతీ రోజు ఉదయం, రాత్రి తప్పకుండా బ్రష్ చేసుకోవాలి. ఈ చిట్కాలు పాటించటం వల్ల వేసవిలో నోరు పొడిబారే సమస్య దరి చేరకుండా ఉంటుంది.