Tooth pain: సాధారణంగా చాలామంది పంటి నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య ఎప్పటికప్పుడు ఉపశమనం కలిగించినప్పటికీ చలికాలంలో మాత్రం తీవ్రమైనటువంటి నొప్పిని బాధను కలిగిస్తూ ఉంటుంది. ఇలా పంటి నొప్పి సమస్యతో కనుక బాధపడుతున్నటువంటి వారు చలికాలంలో ఈ నొప్పి మరింత తీవ్రతరం అయితే వెంటనే ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి పంటి నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందటానికి ఏ విధమైనటువంటి చిట్కాలను ఉపయోగించాలి అనే విషయానికి వస్తే..
సాధారణంగా మనం అధికంగా పేస్ట్ వేసుకొని 10 నిమిషాల పాటు బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా ఉంటాయని నోటి దుర్వాసన రాదని చాలామంది భావిస్తుంటారు. ఇలా చేయడం మొదటికే మోసం వస్తుందని దీని ద్వారా పళ్ళు పూర్తిగా దెబ్బతింటాయని దంత నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎక్కువసేపు బ్రష్ చేయటం వల్ల పల్లపై ఉన్నటువంటి ఎనామిల్ మొత్తం తొలగిపోయి పల్లెలోనే నరాలు జివ్వుమనడం ప్రారంభమవుతాయి దీంతో మనకు చలి తగిలిన లేదా చల్లని పదార్థాలు తిన్నా కూడా పంటి నొప్పి సమస్య వెంటాడుతూ ఉంటుంది.
ఇలా పంటి నొప్పి సమస్యతో కనుక బాధపడుతున్నటువంటివారు కాస్త గోరువెచ్చని నీటిలోకి ఉప్పు వేసుకొని పుక్కిలించడం వల్ల ఈ నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే వెల్లుల్లి కూడా పంటి నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.వెల్లులిలో ఉండే అలిసిన్ అనే ఔషధం పంటి నొప్పిని తొందరగా తగ్గిచేస్తుంది. మూడవది లవంగం వీటితో వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.. నొప్పి రాకుండా ఉండాలంటే ఎక్కువ సేపు బ్రష్ చేయకూడదు. రెండవది పేస్ట్ ఎక్కువగా ఉపయోగించకుండా తక్కువ మొత్తంలోనే వేసుకొని చేయడం మంచిది.