Health Tips: భారతీయ వంటలలో ఇంగువకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన భారతీయ వంటలలో ప్రతి ఒక్క ఆహార పదార్థాలలోనూ ఇంగువను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంగువ ఉపయోగించటం వల్ల వంటకు సరైన రుచి రావడమే కాకుండా ఇంగువ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఇంగువను వేడి నీటితో పాటు కలిపి తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి ఇంగువ వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే….
ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఇంగువ కలిపి సేవించడం వల్ల ఇందులో ఉన్నటువంటి బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడంలో దోహదపడుతుంది అలాగే కంటి చూపు సమస్యలను కూడా నివారిస్తుంది. ఇక కళ్ళు పొడిబారకుండా ఉండడంలోనూ ఇంగువ ఎంతో దోహదం చేస్తుంది. ఇక నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే కడుపునొప్పి సమస్యకు కూడా ఇంగువతో చెక్ పెట్టవచ్చు.గోరువెచ్చని నీటిలో ఇంగువ కలిపి తీసుకోవడం వల్ల కడుపునొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Health Tips:
మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఇంగువ ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యల నుంచి కూడా ఇంగువ బయటపడేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్,అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడంలో ఇంగువ దోహదపడటమే కాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగపరచడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. చిటికెడు ఇంగువను ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.