Health Tips: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందువల్ల వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ మొత్తంలో ద్రవపదార్థాలు తీసుకొని శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. వేసవికాలంలో శరీరానికి చలువ చేసే కొన్ని రకాల జ్యూసులు తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో చెరుకు రసం తాగటం వల్ల వేసవి ఉష్ణోగ్రతల వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.
చెరుకు రసంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి6, విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చెరుకు రసం తాగటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది . వేసవికాలంలో చెరుకు రసం తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
• చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్ లో పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
• చెరుకు రసంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. చెరుకు రసం తాగటం వల్ల ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
Health Tips:
• చెరుకు రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగు పడుతుంది.
• ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. అయితే చెరుకు రసం తాగటం వల్ల శరీరానికి కావాల్సిన నీటి శాతం లభించి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
• చెరుకు రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో కాలేయ సంబంధిత సమస్యలను దరి చేరకుండా కాపాడుతుంది.
• అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తగిలి జ్వరం వస్తుంది. ఆ సమయంలో చెరుకురసం తాగటం వల్ల జ్వరం తగ్గుతుంది.