Health Tips: మన భారతీయ సంస్కృతిలో మహిళలు నుదుటిమీద బొట్టు ధరించటం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి వివాహం జరిగి భర్త మరణించే వరకు మహిళలు నుదుటిన బొట్టు ధరిస్తారు. అయితే ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు. నుదుటి మీద చూపుడువేలుతో బొట్టు పెట్టుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో బొట్టు పెట్టుకోవడం అనే సాంప్రదాయాన్ని పూర్తిగా మరిచిపోయారు.
నుదుటి మీద ఎర్రటి కుంకుమతో బొట్టు పెట్టుకోవడం వల్ల మహిళలు అందంగా కనిపించటమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నుదుటిన బొట్టు పెట్టుకునే ప్రదేశాన్నీ ఆజ్ఞ చక్రం అని అంటారు. మన శరీరంలో ఆరవ అత్యంత శక్తివంతమైన చక్రం ఇది. బొట్టు పెట్టుకునేటప్పుడు నుదుటిని కొంచం వత్తి బొట్టు పెట్టుకొంటాము. అయితే ఆజ్ఞ చక్రం మీద ప్రతి రోజూ ఇలా ఒత్తుతూ బొట్టు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న నాడులు అన్ని ఉత్తేజమవుతాయి.
Health Tips:
మనిషి శరీరంలో వేల సంఖ్యలో నాడులు ఉంటాయి వీటిని అన్నిటికీ కేంద్ర స్థానం ఆజ్ఞ చక్రం. ఈ స్థానంలో నుంచి ప్రాణ శక్తి కిరణాలు ప్రసారం అవుతాయి.అయితే మహిళల లాగా పురుషులు బొట్టు పెట్టుకోలేరు కనుక ఆ స్థానంలో కుంకుమ పెట్టుకున్నా లేక రోజు కనుబొమ్మల మధ్య ఆ పాయింట్ ని ప్రెస్ చేసినా కూడా ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. కనుబొమ్మల మద్య వత్తి బొట్టు పెట్టుకోవడం వల్ల వినికిడి శక్తి మెరుగుపడుతుంది డిప్రెషన్ తగ్గుతుంది చర్మం యవ్వనంగా కనబడుతుంది. అంతే కాకుండా తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు కూడా దరి చేరవు.