Health Tips: సాధారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు దగ్గు జలుబు సమస్యలతో బాధపడటం సర్వసాధారణం ఈ క్రమంలోనే చాలామంది పొడి దగ్గు సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇలా ఈ సమస్య వచ్చినప్పుడు నలుగురులో మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఇలా ఈ పొడి దగ్గు సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు వేసుకున్న ఫలితం ఉండదు.ఈ విధంగా పొడి దగ్గు సమస్యతో బాధపడేవారు ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యను పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
తరచూ మీలో దగ్గు సమస్య రావడానికి గల కారణాలను పరిశీలిస్తే వాతావరణ కాలుష్యం కారణంగా శ్వాస వ్యవస్థలో అలర్జీ ,ఇన్ఫెక్షన్ ప్రారంభమై తీవ్ర దగ్గు సమస్యకు కారణం కావచ్చు. దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా, బ్రాంకైటిస్ న్యుమోనియా, టిబి వంటి వ్యాధులు ఉన్న వారిలో కూడా తరచూ దగ్గు సమస్య తలెత్తవచ్చు. ఇలాంటి సమస్యల వల్ల పొడి దగ్గు సమస్యతో బాధపడేవారు తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని వంటింటి చిట్కాలను పాటించవచ్చు.
Health Tips:
ప్రతిరోజు అల్లం టీ ని సేవిస్తే గొంతులో ఉండే ఇన్ఫెక్షన్, అలర్జీలు తగ్గి తక్షణ ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా దగ్గు సమస్య తలెత్తినప్పుడు గోరువెచ్చని నీళ్లల్లో రాళ్ల ఉప్పును కలిపి రోజుకు మూడుసార్లు నోట్లో ఉప్పు నీళ్లు వేసుకొని ఉక్కిలిస్తే గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గి సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లల్లో చిటికెడు పసుపు వేసుకొని సేవిస్తే దగ్గు సమస్య తగ్గుతుంది. మరియు గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకొని సేవించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే అలర్జీ సమస్య ఉన్నవారు బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి పుప్పడి రేణువుల నుంచి రక్షణ పొందడానికి తప్పనిసరిగా మాస్కు ధరించాలి. అలాగే ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రంగా ఉండటంవల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.