Health Tips: మన దైనందిన జీవితంలో ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు. రోజువారి విశ్రాంత సమయాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదన మీద ద్యాసతో ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆహారపు తీసుకునే పద్ధతి మారిపోయింది. దీంతో మన శరీర ధర్మక్రియలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒక ప్రక్రియకి శరీరం అలవాటు పడింది అనేసరికి మళ్ళీ మన జీవన విధానం మారిపోతుంది. పని వేళల్లో ఇష్టారీతిగా మార్పులు చేయడం కూడా శరీరం క్రమ పద్ధతిలో తన శారీరక స్థితి ఉండకపోవడానికి కారణం అవుతున్నాయి.
ఈ కారణం శరీరంలో వ్యాధినిరోధక శక్తి క్రమంగా క్షీణించి వ్యాధుల బారిన పడుతున్నాం.. అలాగే శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలకి కూడా బలం ఇస్తూ తిరిగి శరీరంపై దాడి చేయడానికి మన పద్దతులు కారణం అవుతున్నాయి అని డాక్టర్లు ఇప్పటికే చెబుతున్నారు. అలాగే ప్యాకేజ్ ఫుడ్, మన ఇళ్ళల్లో వాడే డిటర్జెంట్ లు, సబ్బులు కూడా కూడా క్యాన్సర్ కారకాలుగానే ఉన్నాయి. అలాగే రసాయినలతో పండించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నాం. ఇదిలా ఉంటే ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన తర్వాత తిరిగి ఆరోగ్యంగా బయటపడాలంటే అదృష్టం ఉండాలి.
అయితే ముందుగానే క్యాన్సర్ రాకుండా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ ని కారకాలు వృద్ధి చెందకుండా నియంత్రణలో ఉంచుకోవాలంటే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రతి రోజు ఉదయాన్నే గ్రీన్ యాపిల్, ఆరెంజ్ స్మూతీ త్రాగడం వలన క్యాన్సర్ వృద్ధి చెందకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ యాపిల్, అరేంజ్ స్మూతీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు వ్యాధికారక కణాలపై దాడి చేసి నియంత్రిస్తాయని చెబుతున్నారు. అలాగే వ్యాధినిరోధక శక్తి పెరిగి గుండె సంబందిత రోగాల బారిన కూడా పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.