Health Tips: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు.ఇలా బాధపడే వారిలో చాలామంది శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.ఇలాంటి సమస్యతో బాధపడేవారు జీవితాంతం ఇన్హేలర్స్ వాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధ పడేవారు ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఈ చిట్కాలను పాటిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
దేవతా వృక్షంగా భావించే రావి చెట్టులో మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించే అన్ని ఔషధ గుణాలు నిండుగా ఉన్నాయన్న విషయాన్ని మన పూర్వీకులు ఏనాడో గుర్తించి రావి చెట్టుకు ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. రావి చెట్టు ఆకులు బెరడు వేర్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయన్నమాట..ఆస్తమా, ఉబ్బసం,బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు రావి చెట్టు బెరడు చక్కని పరిష్కారం చూపుతుంది.
Health Tips:
రావి చెట్టు బెరడు లోపలి భాగాన్ని సేకరించి నీడన ఆరబెట్టి పొడిగా గ్రైండ్ చేసుకొని తరచు కొన్ని రోజులపాటు ఈ పొడిని నీళ్లల్లో వేసుకొని లేదా పాలలో కలుపుకొని సేవిస్తే శ్వాస సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు బెరడును నీళ్లలో వేసి బాగా మరగనిచ్చిన తర్వాత వచ్చిన కషాయాన్ని సేవిస్తే రింగ్‌వార్మ్, గజ్జి, దురద వంటి చర్మ వ్యాధుల నుండి చక్కటి పరిష్కారం లభిస్తుంది.ఇక రావి చెట్టు బెరడు ద్వారా ఆరోగ్య సమస్యలను మాత్రమే కాకుండా చర్మ సౌందర్య సమస్యలను కూడా పెంపొందించుకోవచ్చు.