Health Tips: మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో నెలసరి సమస్య ఒకటి. నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా నెలసరి సమయంలో విపరీతమైన నొప్పితో బాధపడేవారు ఎన్ని మందులు మాత్రలు వేసుకున్న ఉపశమనం కలగదు. అయితే ఇలా నెలసరి సమయంలో కలిగే నొప్పి నుంచి విముక్తి పొందాలి అంటే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.
నెలసరి సమయంలో వెన్నునొప్పి కడుపునొప్పి సమస్యతో బాధపడేవారు తక్షణమే ఉపశమనం పొందాలి అంటే గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో మంచిది ఇలా వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కొంతమేర ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో యోగ వాకింగ్ చేయడం వంటి వాటిని చేయటం వల్ల నొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.ఇక చాలామంది కాఫీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే పీరియడ్స్ సమయంలో కాఫీకి కాస్త దూరంగా ఉండి అల్లం టీ తాగటం వల్ల ఉపశమనం పొందవచ్చు.
Health Tips:
ఇక మనం పడుకునే గదిని కాస్త చల్లగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. ఇలా ప్రశాంతమైన నిద్ర కలగడంతో నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఈ నొప్పి సమస్యతో బాధపడేవారు హీట్ ప్యాక్ లేదా హాట్ వాటర్ బాటిల్ తో నడుము కింది భాగంలోను పొత్తికడుపు పైన కాస్త మసాజ్ చేసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా హీట్ ప్యాక్ ద్వారా ఈ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాలను పాటించి నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.