Health Tips:ఒకానొక సమయంలో వయసు బయపడిన తర్వాత వృద్ధాప్యం రావడంతో కంటిచూపు మెరుగుపడేది కానీ ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు చిన్నపిల్లలే ఇప్పుడు కళ్లజోడు పెట్టుకొని తిరుగుతున్నటువంటి సంఘటనలను మనం చూస్తున్నాము. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు మొబైల్ ఫోన్స్ లాప్టాప్స్ చూడటం వల్లే కంటి చూపు మందగిస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఆహారంలో కూడా మార్పులు చోటు చేసుకోవడం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది.
ఈ విధంగా కంటి చూపు సమస్యతో బాధపడేవారు కళ్ళజోడు ద్వారా వారి పనులను చేసుకుంటున్నారు అయితే ఈ కళ్ళజోడు లేకుండా కంటి చూపు సమస్య నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఈ జ్యూస్ ఒక గ్లాసు తాగితే చాలు కంటి చూపు సమస్య మెరుగుపడటమే కాకుండా కళ్ళజోడు అవసరం కూడా మనకు జీవితంలో రాదు మరి ఏ చిట్కాలను పాటించడం ద్వారా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు అనే విషయానికి వస్తే…
Health Tips:
రాత్రి నాలుగు బాదం పప్పులను తెల్లవారిలో నీటిలో నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం ఈ బాదం పప్పుల పొట్టు తీసి వాటిని మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇందులోకి అర టీ స్పూన్ సోంపు కాస్త పటిక బెల్లం వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గ్లాస్ పాలను వేడి చేసి వేడి అయినటువంటి పాలలో ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు పాటు మరిగించాలి అనంతరం వీటిని ఒక గ్లాసుల వడపోసుకొని ప్రతిరోజు తాగటం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషక విలువల కారణంగా కంటి చూపు సమస్య దూరం అవ్వడమే కాకుండా కంటి చూపు మెరుగుపడుతుంది.