Health Tips: సాధారణంగా చాలామందికి తరచూ కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది ఇలా కాఫీ టీ తాగినప్పుడే వారి మనసు మెదడు ప్రశాంతంగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే తరచూ కాపీ టీ తాగుతూ ఉంటారు. అయితే ఇలా వారి ప్రశాంతత కోసం ఎక్కువగా కాఫీ టీ తాగుతున్నారు అంటే తప్పనిసరిగా మీరు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారని అర్థం.
ముఖ్యంగా నాన్ వెజ్ తినే సమయంలో చాలామంది నాన్ వెజ్ తిన్న వెంటనే కూడా కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. అయితే నాన్ వెజ్ తిని కాఫీ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనే విషయానికి వస్తే ఇలాంటి అలవాటు కనుక మీకు ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
నాన్ వెజ్ తిన్న తర్వాత కాఫీ టీ తాగటం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే.. మాంసాహార పదార్థాలలో మనకు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. అయితే ఈ మాంసాహార పదార్థాలను తిన్న వెంటనే కాఫీ తాగటం వల్ల మాంసాహార పదార్థాలలో ఉన్నటువంటి ఐరన్ ను మన శరీరం గ్రహించదు. తద్వారా మనం ఐరన్ పూర్తిగా కోల్పోతాము. అంతేకాకుండా మాంసాహారంలో ఉన్నటువంటి కాల్షియంను కూడా మన శరీరం గ్రహించలేదు తద్వారా అధిక కొవ్వు శాతం పెరుగుతుంది దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులతో పాటు నిద్రలేమి సమస్యలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి.