Health Problem: సాధారణంగా ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగనిదే ఎవరికి రోజు మొదలవదు ఇలా చాలామంది వారి రోజును టీ తోనే మొదలు పెడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం ఏమి తినకుండా ఖాళీ కడుపుతో టీ తాగటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య సమస్యలు ఏంటి అనే విషయానికి వస్తే…
ఉదయం లేచి పరగడుపున టీ తాగడం వల్ల పళ్లలో ఉన్నటువంటి ఎనామిల్ పూర్తిగా దెబ్బతింటుంది. ఇలా ఎనామిల్ దెబ్బ తినటం వల్ల తీవ్రమైన పంటి నొప్పి సమస్యతో బాధపడాల్సి ఉంటుంది. ఉదయం ఏమి తినకుండా టీ తాగటం వల్ల మన ప్రేగు పొరలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. ఏమి తినకుండా టీ తాగటం వల్ల ఎక్కువగా గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది అందుకే మనం టీ తాగే ముందు కాస్త గోరువెచ్చని నీటిని త్రాగడం ఎంతో మంచిది.
Health Problem
పరగడుపున టీ తాగడం వల్ల కడుపు నొప్పి సమస్యతో పాటు డిహైడ్రేషన్ కి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే కళ్ళు తిరగడం గ్యాస్ ఏర్పడటం అజీర్తి మలబద్ధక సమస్యలు కూడా వెంటాడుతాయి. అందుకే టీ తాగడాని కంటే ముందుగా గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగడం ఎంతో మంచిది. అయితే టీ తాగిన వెంటనే మరొక్కసారి నీటిని తాగటం వల్ల దంత నొప్పి సమస్య నుంచి బయటపడటమే కాకుండా దంతాక్షయం నుంచి మన పళ్ళను కాపాడుకోవచ్చు.