Health – Papaya Leaves: సాధారణంగా మనలో చాలామందికి పండిన పపాయ(బొప్పాయి పండు)ను తినడం మంచిదనే విషయం తెలిసిందే. ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన బాలింతలకు ఎక్కువగా బొప్పాయి పండు తినమని చెబుతుంటారు. అందుకు కారణం పాలు బాగా ఉత్పత్తి అవుతాయని. ఇది నిజమే..తల్లికి పాలు బాగాపడి బిడ్డకు కావాల్సినంతగా పాలు అందుతాయి. బొప్పాయి పండు మాత్రమే కాదు, పచ్చి బొప్పాయిని కూరగా చేసి తినిపిస్తుంటారు. ఈ కూర బాలింతలే కాదు అందరూ తినవచ్చు.
బొప్పాయి పండును జూస్‌గా కూడా తయారు చేసి తీసుకుంటుంటారు. అయితే, బొప్పాయి ఆకువల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. ఎందుకంటే, ఆ ఆకు వాసన కాస్త వెగటు పుట్టింది. అందుకే ఆకు జోలికి అంతగా వెళ్ళరు. కానీ, బొప్పాయి ఆకు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుంటే మాత్రం బొప్పాయి చెట్టు ఎక్కడుందో అని వెతికి మరీ దీని ఆకులను తెచ్చుకుంటారు.
మన ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని మందులు మన వద్ద ఉన్నట్టే అనుకోవాలి. ఈ బొప్పాయి ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే, ఈ ఆకును ఎక్కువగా ఆయుర్వేదం మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు, డెంగ్యూ వంటి వ్యాధులకు టాబ్లెట్ తయారీలోనూ బొప్పాయి ఆకుల రసాన్ని ఉపయోగించే తయారు చేస్తారు. అంటే బొప్పాయి ఆకులను ఇంగ్లీషు మందుల తయారీలోనూ అధికంగా వాడతారని అర్థం.
Health – Papaya Leaves: పడిపోయిన ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది.
డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా చాలామందిలో ప్లేట్ లెట్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. దీనివల్ల కొన్ని సందర్భాలలో రోగి ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుంది. ఇలాంటి సయమలో త్వరగా ప్లేట్ లెట్ కౌంట్ పెరగాలంటే బొప్పాయి రసాన్ని రోజూ ఒక టీ స్పూన్ తాగాలి. అలాగే, డాక్టర్ల సూచన మేరకు బొప్పాయి ఆకులతో తయారు చేసిన టాబ్లెట్స్‌ను వాడాలి. దీనివల్ల పడిపోయిన ప్లేట్ లెట్ కౌంట్ మళ్ళీ త్వరగా పెరుగుతుంది.
ఇక మలేరియా జ్వరం వచ్చినా కూడా బొప్పాయి ఆకులను, దానితో తయారు చేసిన మందులను నయం కావడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు, క్యాన్సర్ రోగులకు బొప్పాయి ఆకులు వల్ల నయం అయే మార్గాలున్నాయి. చాలామందికి తలలో దురద వస్తుంటుంది. దీనికి చుండ్రు కూడా ఒక కారణం. జుట్టు సన్నబడిపోవడం, తరచుగా రాలిపోవడం లాంటి సమస్యలకు బొప్పాయి ఆకు మంచి నివారిణిగా పనిచేస్తుంది. ఈ ఆకు రసాన్ని తలకు పట్టించి కొద్దిసేపయ్యాక తలస్నానం చేసినట్టైతే ఈ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.
బొప్పాయి ఆకుల రసంలో ఉన్న ఔషధం మన శరీరంలోని ఇన్సులిన్‌ను బాగా ఉత్పత్తి చేస్తుంది. షుగర్ (చక్కెర వ్యాధి) ఉన్నవారికి బొప్పాయి రసం బాగా పనిచేస్తుంది. దీనివల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఫెనొలిక్ అనే కాంపౌండ్, పపాయిన్, అల్కనాయిడ్స్ వంటి పోషకాలు బొప్పాయి ఆకుల్లో అధికంగా ఉంటాయి. ఈ రసం తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోదిక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలు బొప్పాయి ఆకులో ఉన్నాయి. కాబట్టి అందరూ ఇంట్లో బొప్పాయి మెక్కను నాటుకోండి. రోగాలకు మందు మీ ఇంట్లోనే లభిస్తుంది.