Sapota: పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మనకు తెలిసిందే. అయితే చాలామంది పండ్లు తినడానికి పెద్దగా ఇష్టపడరు.. వాటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని తినే ఓపిక లేక చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ పండ్ల వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా తినకుండా ఉండలేరు అయితే చాలామంది సపోటా పండు తినడానికి కూడా ఇష్టపడరు.. కానీ చూడటానికి చిన్న సైజు ఉండే ఈ సపోటా పండు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు..
మరి సపోటా పండులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఈ పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను మనం పొందవచ్చు అనే విషయానికి వస్తే.. సపోటా పండులో మనకు ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.సపోటా పండ్లలో విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్, ఖనిజాలు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.సపోటాలో కాల్షియం, మాగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇతర ఎముకల సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
ఇక ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది కనుక సపోటా పనులను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపరచడమే కాకుండా మలబద్ధక సమస్యను కూడా పూర్తిగా తగ్గిస్తుంది. ఇక మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.యాపిల్, ఆరెంజ్ కంటే ఎక్కువగా ఉండే ఈ పండులో విటమిన్ సి ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక సపోటా పండు తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు అందుకే తరచూ సపోటా పండును కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది.