Papaya: బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. ఈ పండులో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి కనుక బొప్పాయి పండును ప్రతిరోజు రెండు చిన్న కప్పులు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు. ఇలా బొప్పాయి పండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండటమే కాకుండా మన చర్మ సౌందర్యంతో పాటు జుట్టు సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయి పండును తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకోవడం ఎంతో ముఖ్యం. బొప్పాయి పండును పొరపాటున కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. మరి ఎలాంటి పదార్థాలతో బొప్పాయి పండును కలిపి తినకూడదు ఏంటి అనే విషయానికి వస్తే… బొప్పాయి పండుని ఎప్పుడు కూడా ఇతర పండ్లతో కానీ లేదా ఆహార పదార్థాలతో కానీ కలిపి తినకూడదు.
ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లతో పాటు బొప్పాయి పండును ఎప్పుడు కూడా తినకూడదు.ఇలా తినడం వల్ల తీవ్రమైన కడుపులో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చేందుకు కచ్చితంగా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని అస్సలు కలిపి తినకూడదు. అదేవిధంగా ద్రాక్ష అలాగే కోడిగుడ్లు వంటి పదార్థాలతో కూడా బొప్పాయి పండును కలిపి తినకూడదు. బొప్పాయి పండ్లతో కొంతమంది స్మూతీలను తయారు చేసి తాగుతారు. ఇందులో పాలను కూడా కలుపుతారు. అయితే పాలు, బొప్పాయి పండ్లను కలిపి అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం ఇంకా మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి పాలను, బొప్పాయిని కలిపి ఎప్పుడు తీసుకోకూడదు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.