Wed. Jan 21st, 2026

    Ayurveda: ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్న పదార్ధం అల్లం. ప్రతి రోజు అల్లాన్ని నిత్యం వండుకునే వంటల్లో వినియోగిస్తూనే ఉంటాము. అయితే చాలా మంది ఇది మంచి టేస్ట్‌ను అందిస్తుందని మాత్రమే అపోహపడుతుంటారు. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయన్న విషయాన్ని విస్మరిస్తారు. అల్లం అన్ని రకాల అనారోగ్య సమస్యలను సరిచేయలేవు. కానీ మీరు రెగ్యులర్ డాక్టర్ చెకప్‌కు వెళుతూనే అల్లాన్ని ఆహారంలో వినియోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

    రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది :
    అల్లం వాసన చూసినా, దంచినా ఘాటైన మసాలా వాసన వస్తుంది ఇది ఎందుకో తెలుసా? అల్లంలో ఉండే జింజెరాల్ వల్ల వస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు మీ రోగనిరోధక శక్తిని సపోర్ట్ చేయడానికి సహాయపడుతుంది. అందుకే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అల్లం టీని లేదా అల్లం సలాడ్ ను రోజూ తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించండి.

    Health benefits of Ginger

    మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :
    భారత్‌లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడి చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు. శాస్త్రవేత్తలు ఇన్సులిన్ , జీవక్రియలో మెరుగుదలలతో అల్లంలోని కొన్ని క్రియాశీల సమ్మేళనాలను అనుసంధానించారు. ఒకవేళ మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నట్లయితే ఎండిన లేదా ఫ్రెష్ అల్లంతో స్మూతీస్ చేసుకుని వెజ్జీ రెసీపీస్‌లో జోడించి తినడం వల్ల చక్కని ప్రయోజనం ఉంటుంది.

    పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు :
    అల్లం యొక్క నొప్పి-ఉపశమన లక్షణాలపై చేసిన అన్ని పరిశోధనలలో ఇది ఋతు సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని ఫలితాలు చూపిస్తున్నాయి. అల్లం టీని సిప్ చేయడం వల్ల డేట్ సమయంలో వచ్చే వికారం కూడా తగ్గుతుందట. అయితే చాలా మంది డేట్ సమయంలో నొప్పిని భరించలేక పిల్స్ వేసుకుంటుంటారు. కానీ అల్లం ఉంటే ఈ పిల్స్‌తో అసలు పని అవసరం లేదంటున్నారు నిపుణులు

    కడుపు నొప్పిని తగ్గిస్తుంది:
    కడుపుకు సంబంధించి చిన్నపాటి సమస్యలను అల్లం తీర్చుతుందన్న విషయం కొత్తదేమీ కాదు ఇది అందరికీ బాగా తెలుసు. రీసర్చర్లు కూడా అల్లంలో ఎన్నో డైజెస్టివ్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలిపారు. స్టమక్ అప్‌సెట్‌లో ఉన్నా, వాంతులు వచ్చేలా సెన్సేషన్ ఉన్నా అల్లం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది కడుపులో ఉన్న ఆహారాన్ని చిన్న పేగుకు పంపించి అరిగించగలదు.

    కాబోయే తల్లుల్లో మార్నింగ్ సిక్‌నెస్‌ను దూరం చేస్తుంది :
    ప్రెగ్నెంట్ మహిళల్లో ఎదురయ్యే మార్నింగ్ సిక్‌నెస్‌ లక్షణాలను తగ్గించడంలో అల్లం సమ్థవంతంగా సహాయపడుతుంది. వాస్తవానికి, గర్భధారణ సమయంలో అల్లం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు మద్దతును ఇస్తున్నాయి. 2018లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, కాబోయే తల్లులు రోజుకు 1 గ్రాము తాజా అల్లం చొప్పున నాలుగు రోజులు తీసుకుంటే వికారం, వాంతులు గణనీయంగా తగ్గాయిని, తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించింది. .

    గుండె సంబంధిత జబ్బులను నివారిస్తుంది :
    అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్‌ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అల్లం రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తంలో ఉన్న కొవ్వు స్థాయిలను తగ్గించగలదని 2019లో జరిగిన పరిశోధనలో తెలిసింది. ఈ రెండూ గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అయితే కేవలం అల్లం తింటే చాలు అని పొరబడేరు అల్లంతో పాటు ఎక్కువగా కూరగాయలను తినడం, 100 శాతం తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం, లీన్ ప్రోటీన్లు, చేపలు, చిక్కుళ్లు, బీన్స్ ను తినడం వల్ల హార్ట్ స్ట్రోక్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.