Butter Milk: వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా పానీయాలను తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా వేసవి తాపం నుంచి బయటపడటం కోసం చాలామంది మజ్జిగను తయారు చేసుకుని తరచూ మజ్జిగ తాగుతూ ఉపశమనం పొందుతూ ఉంటారు. ఇలా వేసవి కాలంలో దాహాన్ని తీర్చుకోవడానికి మజ్జిగను అధికంగా తీసుకుంటూ ఉంటారు ఇలా మజ్జిగ తాగటం వల్ల వేసవి తాపం నుంచి బయటపడేటమే కాకుండా డిహైడ్రేషన్ కి కూడా గురికాకుండా ఉంటారు అయితే మజ్జిగ తీసుకోవడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుదాం..
మజ్జిగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉన్నటువంటి విటమిన్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. మజ్జిగ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. ఇక మజ్జిగను తాగటం వల్ల మనకు కావాల్సినటువంటి కాల్షియం కూడా అందుతుంది.
ఇక తరచూ గ్లాస్ మజ్జిగను తాగుతూ ఉండటం వల్ల వేసవి తాపం తొలగిపోవడమే కాకుండా వడదెబ్బకు గురి కాకుండా ఉంటాము అంతేకాకుండా మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా హైడ్రేట్ గా ఉంటుంది తద్వారా మన చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. అందుకే వేసవి కాలంలో పెరుగుతో వీలైనంత వరకు తగ్గించి మజ్జిగనే అధికంగా తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా మనం పొందవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.