Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన గుండె పోటు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఇప్పటికైనా మేల్కొని రోజువారి మన ఆహారంలో రక్తపోటు ప్రమాదాన్ని పెంచే ఉప్పు, కారం, మసాలా, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింకును తీసుకోవడం తగ్గించి సంపూర్ణ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన జ్యూసులను మన డైట్ లో చేర్చుకుంటే సహజ పద్ధతిలో హై బీపీ, గుండెపోటు ప్రమాదాలను కంట్రోల్ లో పెట్టవచ్చు.
దానిమ్మ పండులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, అత్యధిక పొటాషియం, మెగ్నీషియం కాల్షియం వంటి ఖనిజ లవణాలు రక్తనాళాలను శుద్ధిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి తద్వారా హై బీపీ సమస్యకు చెక్ పెట్టవచ్చ. అత్యంత చేదుగా ఉండి కాకర రసంలో విటమిన్ సి, పొటాషియం, సోడియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కావున రక్తనాళాలను శుద్ధిచేసి రక్తపోటు అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
ప్రతిరోజు పాలకూర జ్యూస్ సేవిస్తే ఇందులో ఉండే అత్యధిక పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజు బీట్రూట్ రసాన్ని సేవిస్తే బీట్రూట్ లో నైట్రేట్ నిల్వలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేసి రక్తనాళాలను శుద్ధి చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తద్వారా హై బీపీ సమస్య తొలగించుకోవచ్చు. ఇలా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి జ్యూస్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని పది కాలాలపాటు పదిలంగా ఉంచుకోవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.