Head Bath: చలికాలం మొదలైంది అంటే చాలు వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే చలికాలంలో చాలా మంది బయటకు రావడానికి కూడా ఇష్టపడరు అయితే చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఎవరు కూడా చల్లనీలతో చేయాలని అనుకోరు. చలికాలంలో వేడినీళ్లతో స్నానం చేయడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు అయితే మనకు తెలియని విషయం ఏమిటంటే చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తలస్నానం చేసేటప్పుడు జుట్టు పెరుగుదలకు ఎంతో ఆటంకాలు ఏర్పడతాయి.
చలికాలంలో చల్లని నీటితో స్నానం చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కానీ వేడి నీటితో చేయటం వల్ల ముఖ్యంగా జుట్టు ఎదుగుదలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వేడి నీటితో తలస్నానం చేయటం వల్ల మన జుట్టు కుదుళ్లు చాలా బలహీనపడతాయి అలాగే మన తలలో ఉన్నటువంటి తేమ మొత్తం ఆరిపోవడం వల్ల తల మొత్తం డాండ్రఫ్ రావడానికి కారణం అవుతుంది అలాగే కుదుర్లు కూడా బలహీనపడి జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. అందుకే చలికాలంలో వేడి నీటితో తల స్నానం చేయటం వల్ల జుట్టు ఎదుగుదలకు కూడా తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి.
వేడి నీటితో స్నానం చేయటం వల్ల జుట్టులోని హైడ్రోజన్ బంధాలను విచ్ఛిన్నం చేయడానికి కారణం అవుతుంది కనుక జుట్టు పూర్తిగా డ్రై కావడానికి కారణమవుతుంది. చల్లని నీటితో స్నానం చేయడం వలన తలలో తేమని లాక్ చేస్తుంది. క్యూటికల్ మూసుకుపోతుంది. జుట్టు స్మూత్ గా తయారవుతుంది. ఇక వారంలో కనీసం రెండుసార్లు ఆయన తల స్నానం చేయటం జుట్టు ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. మనం చేసిన వెంటనే హెయిర్ కండిషనర్ వాడటం వల్ల జుట్టు పగిలిపోకుండా రఫ్ కాకుండా చాలా స్మూత్ గా తయారవుతుంది.